Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్​ పాటకు జపాన్​ జంట డ్యాన్స్​.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

By:  Tupaki Desk   |   15 Sep 2020 5:32 PM GMT
ఎన్టీఆర్​ పాటకు జపాన్​ జంట డ్యాన్స్​.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
X
తెలుగు సినిమాల్లో హిట్టయిన పాటలను అనుకరిస్తూ వారి అభిమానులు డ్యాన్స్​లు చేయడం కామనే.. రంగస్థలం సినిమాలో హిట్టయిన రంగమ్మ.. మంగమ్మ అనే పాటకు దీప్తి సునయన చేసిన డ్యాన్స్​ సోషల్​మీడియాలో విపరీతంగా వైరల్​ అయ్యింది. ఈ పాటతో దీప్తి సెలబ్రిటిగా మారిపోయారు. ఇటీవల మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నటుడు సుధాకర్​ కొముల, అతడి భార్య చేసిన ‘ఇందువదన’ డ్యాన్స్ కూడా తెగ వైరల్​ అయ్యింది. వీళ్ల డ్యాన్స్​కు చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. డ్యాన్స్​ బాగుందంటూ సుధాకర్​ దంపతులను మెచ్చుకుంటూ ఓ ట్వీట్​ కూడా పెట్టారు. కానీ ఇప్పుడో జపాన్​ జంట జూనియర్​ ఎన్టీఆర్​ పాటకు డ్యాన్స్​ చేశారు. కంత్రీ సినిమాలోని ‘వయస్సునామి’ పాటకు ఓ జపనీస్​ జంట డ్యాన్స్​ చేసింది. మామూలుగా ఇంట్లో పనులు చేసుకుంటున్నట్టుగా ఈ డ్యాన్స్​ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

జపాన్​కు హెరో మునియెరు లో కాస్టూమ్​ డిజైనర్​, ఫొటో గ్రాఫర్​గా పనిచేస్తుంటాడు. అతడు ఎన్టీఆర్​కు వీరాభిమాని. అతడి కుటుంబసభ్యులు, పిల్లలు అంతా ఈ పాటకు డ్యాన్స్​ చేశారు. గతంలో ఈ జంట అశోక్​ చిత్రంలోని ‘గోలగోల రంగోలా’ సింహాద్రి చిత్రంలోని ‘చీమచీమ’ పాటలకు కూడా డ్యాన్స్​ చేశారు. జూనియర్​ ఎన్టీఆర్​కు జపాన్​ కూడా అభిమానులు ఉండటం విశేషం. గతంలో జపాన్​కు చెందిన ఓ అభిమాని ‘జనతాగ్యారేజ్​’ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్​తో ఫొటో తీయించుకున్నారు.