Begin typing your search above and press return to search.

జ‌ల‌కాలాట‌ల‌లో ఏమి హాయిలే హ‌లా..!

By:  Tupaki Desk   |   23 April 2022 11:30 PM GMT
జ‌ల‌కాలాట‌ల‌లో ఏమి హాయిలే హ‌లా..!
X
జలకాలాటలలో గల గల పాటలలో .. ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా...ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా..ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె.. ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె... అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే.

జలకాలాటలలో గల గల పాటలలో ..ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా..ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా..తీయని రాగమెదో మది హాయిగ పాడెనె తీయని రాగమెదో మది హాయిగ పాడెనె .. తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే ..తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే .. అది వరుని కొరకు పిలిపే.

జలకాలాటలలో గల గల పాటలలో... ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా...ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా గాయకులు పి.లీల- పి.సుశీల బృందం ఆల‌పించిన ఈ పాట‌కు క్లాసిక్ నాయిక‌ల న‌ర్త‌న‌లు మ‌ర్చిపోలేనివి.

ఇప్పుడు ఈ స‌న్నివేశం చూస్తుంటే జాన్వీ తిరిగి పాత రోజుల్ని గుర్తుకు తెస్తోంది. నిజానికి జ‌ల‌కాలాట‌ల సాంగ్స ని తెర‌కెక్కించే జోరు ఇటీవ‌ల సినిమాల్లో పెద్దంత‌గా క‌నిపించ‌డం లేదు. ఇంత‌కుముందు బాహుబ‌లి లో అవంతిక‌తో ప్ర‌భాస్ రొమాన్స్ ని కాస్త జ‌ల‌పాతాల న‌డుమ తెర‌కెక్కించారు రాజ‌మౌళి.

కానీ ఆయ‌నే దిగొచ్చి ఇప్పుడు జాన్వీని కూడా జ‌ల‌కాలాట‌ల్లో చూపిస్తారేమో చూడాలి. అన్న‌ట్టు త‌న‌వ‌ద్ద ఓ రెండు లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు ఉన్నాయ‌ని రాజ‌మౌళి అన్నారు. ఆయ‌న‌కు జాన్వీ పేరును స‌జెస్ట్ చేస్తే త‌ప్పేమీ కాదేమో.

ఇటీవ‌ల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది ఈ న‌ట‌వార‌సురాలు. పైనుంచి అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి దీవెన‌లు అందుకుంటోంది. కాస్త జ‌క్క‌న్న అటువైపు ఓ క‌న్నేస్తాడేమో చూడాలి. అన్న‌ట్టు బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర‌ను ఆఫ‌ర్ చేస్తే కాద‌న్న శ్రీ‌దేవి కూతురికి జ‌క్క‌న్న అవ‌కాశ‌మిస్తాడంటారా?