Begin typing your search above and press return to search.

సేఫ్‌ గేమ్ ప్లే చేస్తున్న జాన్వీ కపూర్‌

By:  Tupaki Desk   |   18 Jun 2022 1:30 PM GMT
సేఫ్‌ గేమ్ ప్లే చేస్తున్న జాన్వీ కపూర్‌
X
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌. హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ ఇప్పటి వరకు పలు ప్రాజెక్ట్‌ ల్లో నటించింది. అందులో వెబ్‌ సిరీస్ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కమర్షియల్‌ గా మాత్రం ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు దక్కలేదు. అయినా కూడా ఆఫర్లు తగ్గలేదు.. సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్ విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

ప్రస్తుతం నయనతార హీరోయిన్‌ గా నటించి సూపర్ హిట్‌ అయిన కొలమావు కోకిల సినిమా రీమేక్ లో నటిస్తుంది. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చి త్వరలో విడుదల కాబోతున్న ఆ రీమేక్ కు 'గుడ్‌ లక్ జెర్రీ' అనే టైటిల్‌ ను ఖరారు చేశారు.

ఈ రీమేక్ లో నయనతార మాదిరిగా నటించేందుకు జాన్వీ కపూర్‌ చాలా కష్టపడిందట. పడ్డ కష్టంకు ప్రతిఫలం ఉంటుందని.. తప్పకుండా ఈ రీమేక్ సక్సెస్ అవుతుందనే నమ్మకం తో జాన్వీ ఉంది.

గుడ్ లక్ జెర్రీ మాత్రమే కాకుండా మరో మలయాళం మూవీ ని కూడా జాన్వీ రీమేక్ చేస్తుంది. ఆ రీమేక్ కు సంబంధించిన వర్క్ జరుగుతోంది. రీమేక్ లు అంటే సేఫ్ గేమ్‌ ప్లే. అప్పటికే విడుదల అయ్యి విజయం సాధించిన సినిమా ను రీమేక్ చేయడం వల్ల సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కనుక సేఫ్ గేమ్‌ అని చాలా మంది సీనియర్ స్టార్‌ హీరోలు కూడా రీమేక్ ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా బాలీవుడ్‌.. కోలీవుడ్‌.. టాలీవుడ్‌ ఇలా అన్ని చోట్ల కూడా ప్రస్తుతం రీమేక్ లు రాజ్యం ఏలుతున్నాయి. ఒక్క చోట సక్సెస్ అయితే ఆ సినిమా ను అన్ని భాషల్లో రీమేక్‌ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు జాన్వీ కపూర్‌ కూడా అదే పంథాలో నడుస్తున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల్ల్ చర్చ జరుగుతోంది.

జాన్వీ మొదటి సినిమా మరాఠీ మూవీ కి రీమేక్ అనే విషయం తెల్సిందే. ఆ సినిమా నుండి ఇప్పటి వరకు వరుసగా ఆమె రీమేక్ లపై ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. అంతే కాకుండా ఆమె ఖచ్చితంగా సక్సెస్ ను దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ కు ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. అలా ఈమె సేఫ్ గేమ్‌ ఆడుతూ స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ టాక్‌ వినిపిస్తుంది.