Begin typing your search above and press return to search.

దూసుకొస్తున్న సునామీలా శ్రీ‌దేవి రెండో ‌వార‌సురాలు..!

By:  Tupaki Desk   |   20 March 2021 2:30 AM GMT
దూసుకొస్తున్న సునామీలా శ్రీ‌దేవి రెండో ‌వార‌సురాలు..!
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి లెగ‌సీని ముందుకు న‌డిపించే బాధ్య‌త‌ను ప్ర‌స్తుతానికి జాన్వీ క‌పూర్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒక్కో సినిమాలో చ‌క్క‌ని ప‌రిణ‌తి చెందిన‌ న‌ట‌న‌తో జాన్వీ మెరిపిస్తోంది. అయితే త‌న‌కు ఇక‌పై ఇంటి నుంచే పోటీ ఎదురు కానుందా? అంటే అవుననే స‌న్నివేశం చెబుతోంది.

గ‌త కొంత‌కాలంగా జాన్వీ సోద‌రి ఖుషీ క‌పూర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏ క్ష‌ణ‌మైనా ఖుషీని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసేందుకు పాపా బోనీక‌పూర్ చేయాల్సిన ప్ర‌య‌త్నాలన్నీ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఖుషీ లాస్ ఏంజెల్స్ లో న‌ట శిక్ష‌ణ కోసం ప్రిప‌రేష‌న్ లో ఉంది. అక్క‌డి నుంచి త‌ను రాగానే ఇక్క‌డ ఓ అగ్ర నిర్మాణ సంస్థ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంటుంద‌ని తెలిసింది. అయితే అది ఏ సంస్థ అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ రివీల్ చేయ‌లేదు.

మ‌రోవైపు ఖుషీకి అన్నివిధాలా స‌హ‌క‌రించేందుకు సోద‌రి జాన్వీ క‌పూర్ సిద్ధంగా ఉన్నారు. ఖుషీ న‌ట‌శిక్ష‌ణ కోసం ఒక‌ సంస్థను ఎంచుకోవడంలో సహాయపడటానికి జాన్వీ లాస్ ఏంజెల్స్ కి బ‌య‌ల్దేరనుందిట‌. గుడ్ లక్ జెర్రీ షూట్ పూర్తయిన తర్వాత జాన్వీ LA కి వెళుతుంద‌ని సమాచారం. ఈలోగానే లాస్ ఏంజెల్స్ వీధుల్లో సెల్ఫీలు ఫోటోలను షేర్ చేస్తూ ఖుషీ త‌న అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో అంతే వ‌ర‌ల్ గా మారింది. డ‌బుల్ షేడెడ్ స్వెట్ ష‌ర్ట్ ధ‌రించిన ఖుషీ లూజ్ జీన్స్ ధ‌రించి అల్ట్రా స్టైలిష్ గా క‌నిపిస్తోంది. ఖుషీ కొత్త లుక్ ప్ర‌స్తుతం అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. నిజానికి బాలీవుడ్ ‌లో ప్ర‌వేశించాల‌ని ఖుషీకి గోల్ ఉన్నా.. ఎందుక‌నో బోనీ మాత్రం ఎటువంటి హడావిడి చేయ‌డం లేదు.