Begin typing your search above and press return to search.

పూనమ్ పాండేకి జాన్వీ హైక్లాస్ వెర్ష‌నా?

By:  Tupaki Desk   |   18 Jun 2022 3:58 AM GMT
పూనమ్ పాండేకి జాన్వీ హైక్లాస్ వెర్ష‌నా?
X
క‌పూర్ వంశ‌పు ఫ్యాష‌నిస్టా సోన‌మ్ క‌పూర్ ఎగ్జిట్ త‌ర్వాత ఆ రోల్ ని కాపాడేందుకు జాన్వీ క‌పూర్ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే జాన్వీ బాలీవుడ్ లో ప‌ర్ఫెక్ట్ ఫ్యాష‌నిస్టాగా పేరు తెచ్చుకుంది. నిరంత‌రం లైమ్ లైట్ లో ఉండేందుకు ఏం చేయాలో ప‌ర్ఫెక్ట్ గా ట్రైన‌ప్ అయ్యింది.

ఇక జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతూ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక్కోసారి జాన్వీ హ‌ద్దులు చెరిపేస్తూ వేడెక్కించడం నెటిజ‌నుల్లో కాక‌లు పుట్టిస్తోంది. ఇప్ప‌డు మ‌రోసారి అలాంటి ఫీట్ రిపీటైంది.

జాన్వీ కపూర్ టూ బోల్డ్ గా ఉన్న‌ నెక్ లైన్ డ్రెస్ తో క‌నిపించ‌గా నెటిజ‌నుల నుంచి తీవ్ర‌మైన‌ ట్రోలింగ్ ని ఎదుర్కొంది. త‌న లుక్ ని చూడ‌గానే.. ఒక‌రు 'పూనమ్ పాండే కా హై క్లాస్ వెర్షన్' అంటూ ట్రోల్ చేసారు. జాన్వీ కపూర్ ధ‌రించిన తాజా డ్రెస్ ఎంతో వ‌ల్గ‌ర్ గా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ డ్రెస్ లో త‌న‌ని చూశాక పూనమ్ పాండే .. ఉర్ఫీ జావేద్ లతో పోల్చారు. జాన్వీ కపూర్ డీప్ నెక్ లైన్ .. సైడ్ కట్ అవుట్ బ్లాక్ డ్రెస్ లో టూ సెక్సీగా క‌నిపించింది.

ఈ ఫోటోషూట్ పై అభిమానులు ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లు చేసారు. చాలా మందికి ఇది ఐఫీస్ట్ గా క‌నిపిస్తే కొంద‌రు మాత్రం జాన్వీని ఉర్ఫీ జావేద్ లా మారింది అంటూ కామెంట్ చేసారు. నిజానికి జాన్వీ ఫ్యాషన్ ఎంపికలపై నిరంత‌రం ఏవో కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మ‌రోసారి జాన్వీ దుస్తులను నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఓ నెటిజ‌న్ అయితే.. అన్ని శస్త్రచికిత్సల తర్వాత జాన్వీ ఇలా క‌నిపించింది! అంటూ కూడా కామెంట్ చేసారు. బోల్డ్ అండ్ సెక్సీ లుక్స్ తో వేడెక్కిస్త‌న్న జాన్వి తరచుగా స్కిన్ షో ల‌పై ఇంటర్నెట్ లో ట్రోలింగుకి గుర‌వుతోంది. అయితే ట్రోల‌ర్స్ కి స్పందించేందుకు ఇటీవ‌ల జాన్వీ ఏమాత్రం ఆస‌క్తిగా లేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వీ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. రొమాంటిక్ కామెడీ దోస్తానా 2 విడుద‌ల‌కు రావాల్సి ఉంది. అలాగే ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన 'గుడ్ లక్ జెర్రీ'లో జాన్వీ కపూర్ నటిస్తోం. హెలెన్ రీమేక్ 'మిల్లీ'లోను నాయిక‌. రూహి సహనటుడు రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి లో న‌టిస్తోంది.

వరుణ్ ధావన్ తో 'భ‌వాల్' అనే చిత్రం చేస్తోంది. నేటిత‌రంలో వ‌రుస ఆఫ‌ర్ల‌తో క్రేజీ నాయిక‌గా వెలిగిపోతోంది జాన్వీ. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. కొంతమంది అగ్ర తెలుగు చిత్రనిర్మాతలు ఇప్పటికే ఇదే పనిలో ఉన్నారు. కానీ జాన్వీ ఎందుక‌నో ఇంకా వేచి చూస్తోంది.