Begin typing your search above and press return to search.

ఆఫ్రికాలో `జాను` షూటింగ్

By:  Tupaki Desk   |   9 April 2019 8:03 AM GMT
ఆఫ్రికాలో `జాను` షూటింగ్
X
త్రిష, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన 96 తమిళంలో ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. అక్కడ 100 కోట్ల క్లబ్ సినిమాగా రికార్డులకెక్కింది. ఆ సినిమాని శర్వానంద్, సమంత జంటగా తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగువెర్షన్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి కథ అందించారు. ఈ పాటికే సెట్స్ కెళ్లాల్సిన సినిమా స్క్రిప్టు పని ఆలస్యం అవ్వడంతో ప్రారంభం కాలేదు. తాజాగా క్రియేటివ్ డిఫరెన్సెస్ క్లియర్ చేసుకుని టైటిల్ ని ప్రకటించారు. మొన్న ఉగాది రోజున `జాను` అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. వైజాగ్, హైదరాబాద్ నేపథ్యంలోనే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ సాగనుందని తెలుస్తోంది.

`జాను` షెడ్యూల్స్ ని దిల్ రాజు బృందం ఫిక్స్ చేశారట. వాటి వివరాలు పరిశీలిస్తే .. జూలై నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారు. 15రోజుల షెడ్యూల్ ని కెన్యాలో తెరకెక్కిస్తారట. తదుపరి వైజాగ్ లో చిత్రీకరణ సాగిస్తారు. అటుపై చివరిగా హైదరాబాద్ లో షూటింగ్ తో మొత్తం చిత్రీకరణ పూర్తవుతుంది. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్.

ఓ షెడ్యూల్ మాత్రం ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే టాలీవుడ్ నుంచి కెన్యా వెళుతున్న తొలి సినిమా ఇదే అవుతుందన్న ముచ్చటా సాగుతోంది. ప్రపంచ కప్ క్రికెట్ గురించి మాటా మంతీ వచ్చినప్పుడు కెన్యా ఎంతటి పేద దేశమో అన్న డిస్కషన్ సాగుతుంది. అప్పుడు తప్ప ఇంకెప్పుడూ ఆ దేశం గురించిన ప్రస్థావన ఉండదు. ప్రస్తుతం అలాంటి పేద దేశానికి శర్వా యూనిట్ బయల్దేరి వెళ్లడం అన్నది హాట్ టాపిక్. ఇక 96 మాతృక ప్రకారం చూస్తే కెన్యా వెళ్లేది శర్వా మాత్రమే. సమంత వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. జాను చిత్రంలో శర్వానంద్, త్రిష పాత్రలు ఆసక్తికరం. ఇందులో శర్వా ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కనిపించనున్నారు.