Begin typing your search above and press return to search.

క‌రోనా సెల‌బ్రేష‌న్ .. ముఖాలు ట్యూబ్ లైట్ల‌లా వెలిగాయే!

By:  Tupaki Desk   |   23 March 2020 4:58 AM GMT
క‌రోనా సెల‌బ్రేష‌న్ .. ముఖాలు ట్యూబ్ లైట్ల‌లా వెలిగాయే!
X
చావునైనా సంబ‌రంలా జ‌రుపుకోవ‌డం కొంద‌రికే సాధ్యం. అయ్యోయ్.. బాబోయ్.. అమ్మ‌య్యో.. అంటూ ముక్కు చీదుకుంటూ ఏడ్చేవాళ్లు కొంద‌రుంటే.. వీళ్లంద‌రికీ డిఫ‌రెంటుగా చావును కూడా ఒక సెల‌బ్రేష‌న్ లాగా... డ‌ప్పుతో ద‌రువేసి మందేసి చిందేసి కాట‌కానికి తీసుకెళ్లే జ‌నాల్ని కొంద‌రిని చూస్తున్నాం. చికెను మ‌ట‌న్ బిరియానీల‌తో సెల‌బ్రేట్ చేసేవాళ్ల‌ను లోకంలో రెగ్యుల‌ర్ గానే వీక్షిస్తున్నాం. శ‌వానికి సెండాఫ్ ఇచ్చి అట్నుంచి అటే ఫ‌క్వాన్ - బావార్చీ- మెహ‌ఫిల్- షా ఘౌస్ బిరియానీల‌పై ఎగ‌బడేవాళ్ల సంగ‌తిని చూశాం. ఇక క‌రోనా వైర‌స్ మృత్యువుని మించి దూసుకొస్తున్న వైనం చూస్తుంటే జ‌నాల ముఖాలు దీపం చిమ్మీ మ‌సిలా మాడిపోతాయ‌నుకుంటే.. ఇదేంటి చెప్మా ఇలా ట్యూబ్ లైట్ల‌లాగా వెలిగిపోతున్నాయ్!

క‌రోనా వైర‌స్ ని త‌రిమేయ‌డంలో భాగంగా ప్ర‌ధాని మోదీ పిలుపును గౌర‌వించి దేశ ప్ర‌జ‌లు జ‌న‌తా క‌ర్ఫ్యూకి స‌హ‌క‌రించారు. ఇక ఈ క‌ర్ఫ్యూ విజ‌య‌వంతం అయిన సంద‌ర్భంగా ...ఆదివారం సాయంత్రం క్లాప్స్ మూవ్ మెంట్ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సెల‌బ్రిటీలు ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి క్లాప్స్ కొట్ట‌డ‌మే గాక‌.. ర‌క‌ర‌కాల వ‌స్తువుల్ని తీసుకుని శ‌బ్ధం చేస్తూ వైబ్రేష‌న్స్ క్రియేట్ చేశారు. ఇందులో టాలీవుడ్ - బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల సెల‌బ్రిటీలు ఉన్నారు.

బాలీవుడ్ లోనూ ప‌లువురు సెల‌బ్రిటీలు ఇళ్ల‌లోంచి బ‌య‌టికి వ‌చ్చి క్లాప్స్ కొట్టారు. ఇందులో అక్షయ్ కుమార్- అంగద్ బేడి- దీపికా పదుకొనే- హృతిక్ రోషన్- నేహా ధూపియా- రణ్‌వీర్ సింగ్- సాజిద్ నాడియాద్వాలా- వరుణ్ ధావన్- విక్కీ కౌషల్- క‌త్రిన త‌దిత‌రులు ఉన్నారు. ఇక ప్ర‌ధాని మోదీ సైతం క్లాప్స్ కొడుతూ స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఈ సెల‌బ్రేష‌న్స్ లో బాలీవుడ్ తార‌లంతా న‌వ్వులు చిందిస్తూ ఒక సంబ‌రంలా జ‌రుపుకోవ‌డం ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తోంది. క‌రోనా చావునైనా సంక్రాంతి పండ‌గ‌లా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేయ్ బ్ర‌ద‌ర్...ర్..ర్ అంటే ఇదేనేమో!!!