Begin typing your search above and press return to search.

జానీ మాటల్లో బాలయ్య

By:  Tupaki Desk   |   9 Jan 2018 11:52 AM IST
జానీ మాటల్లో బాలయ్య
X
కోపం వస్తే పట్టలేరు, తిడతారు, కొడతారు, ఏది మనసులో ఉంచుకోరు, నేరుగా పైకే అనేస్తారు అని బాలకృష్ణ గురించి బయట కొన్ని కామెంట్స్ తరచుగా వినిపిస్తున్నప్పటి నిజమేంటి అనేది ఆయనకు దగ్గరగా ఉండే వాళ్ళకు మాత్రమే తెలుసని సన్నిహితులు అంటూ ఉంటారు. అలాంటి ముచ్చట ఒక డాన్స్ మాస్టర్ జాని నిన్న జరిగిన జైసింహ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో షేర్ చేసుకున్నాడు. అందరు బాలయ్యని అపార్థం చేసుకున్నారని, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మొదలుకొని తెలుగులో స్టార్ హీరోస్ అందరి దగ్గర పని చేసిన తనకు బాలయ్య బెస్ట్ అనిపించాడని ఆకాశానికెత్తేసాడు. ఆయనలో సిన్సియారిటీ - సినిమా పట్ల తపన, ఇతరులను గౌరవించే తీరు ఇవన్ని తనని కట్టిపడేశాయి అన్న జాని మరో సంఘటన కూడా షేర్ చేసుకున్నాడు.

ఈ సినిమా కోసం తాను కంపోజ్ చేసిన ఒక పాటను ప్రాక్టీసు చేయటం కోసం బాలయ్య రాత్రి మొత్తం మేలుకొని మరుసటి రోజు ఆ సాంగ్ షూట్ కోసం సిద్ధం కావడం తనకు ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పిన జానీ మాస్టర్ ఈ పాటకు బాలయ్య వేసిన స్టెప్స్ కు థియేటర్లో అభిమానులు వెర్రెక్కి పోతారు అని హామీ ఇచ్చాడు. సినిమా వేడుకల్లో ఇలా చెప్పుకోవడం సహజమే ప్రత్యేకంగా జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న జైసింహపై ఫాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది.