Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ 4'లో అతను పార్టిసిపేట్ చేసేది నిజమేనా...?

By:  Tupaki Desk   |   17 Aug 2020 2:30 AM GMT
బిగ్ బాస్ 4లో అతను పార్టిసిపేట్ చేసేది నిజమేనా...?
X
బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన 'బిగ్‌ బాస్' తెలుగు రియాలిటీ షో నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్‌ కి మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. ఇప్పటికే 'కింగ్' నాగార్జున మూడు పాత్రల్లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన 'బిగ్‌ బాస్' తెలుగు సీజన్ 4 ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో కరోనా నేపథ్యంలో ఈ సారి బిగ్‌ బాస్ షో ఎలా ఉండబోతోంది.. నిర్వాహకులు ఎన్ని రోజులు ప్లాన్ చేసారు.. ఎలా ప్లాన్ చేశారని అందరిలో చర్చ నడుస్తోంది. అలానే ఈసారి బిగ్ బాస్ హౌజ్‌ లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్యాన్స్ మాస్టర్ జానీ 'బిగ్ బాస్' లో పార్టిసిపేట్ చేయబోతున్నారనే న్యూస్ స్ప్రెడ్ అయింది.

కాగా టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కొరియగ్రాఫర్స్ లోన్ ఒకరైన జానీ.. ఎలాంటి సాంగ్స్ అయినా అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేస్తాడనే పేరుంది. జానీ కొరియోగ్ర‌ఫీ చేస్తే ఏ పాటైనా హిట్ అందుకోవాల్సిందే అనే రేంజ్‌ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో కి మరింత ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడానికి నిర్వాహకులు ఆయనతో సంప్రదింపులు జరిపి భారీ ఆఫర్ ఇచ్చారని.. దానికి ఆయన ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయని వార్తలు వస్తున్నాయి. సీజ‌న్‌ 3 లో కొరియోగ్రాఫ‌ర్‌ బాబా భాస్కర్ డ్యాన్స్ క‌న్నా ఎక్కువ‌గా కామెడీని పండిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంటర్టైన్ చేసారు.

ఈ క్ర‌మంలో సీజన్ 4లో కూడా ఓ కొరియోగ్రాఫ‌ర్‌ ను తీసుకు వ‌స్తే షోకు అద‌న‌పు హంగు వ‌స్తుంద‌న్న నమ్మకంతో ఉన్నారట. అందులోనూ ఇప్పుడు సినిమా షూటింగ్స్ ఏమీ లేకపోవడం.. సీజన్ 4 తక్కువ రోజులే ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జానీ మాస్ట‌ర్ పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే క్రమంలో డ్యాన్స్ మాస్టర్ రఘు కూడా ఈ షో లో పార్టిసిపేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.