Begin typing your search above and press return to search.
చెప్పులరిగేలా తిరుగుతుంటే చేరదీసిన హీరో నితిన్!
By: Tupaki Desk | 31 July 2022 11:00 AM ISTజానీ మాస్టర్ కెరియర్ ను పరిశీలిస్తే ఆయన ఎంతగానో కష్టపడుతూ ఈ స్థాయికి రావడం కనిపిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ .. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ .. తనని తాను నిరూపించుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల విజయ్ హీరోగా చేసిన 'బీస్ట్' సినిమాలోని 'అరబిక్ కుతూ' సాంగ్ జానీ మాస్టర్ కి మంచి పేరును తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ ను కంపోజ్ చేశాడు. నితిన్ - అంజలిపై చిత్రీకరించిన ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జాన్ మాస్టర్ మాట్లాడుతూ .. "నాకు సినిమాలు అంటే ఇష్టం .. ఈ సినిమా అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నాకు నితిన్ అంటే ఇష్టం. కెరియర్ పరంగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు .. చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నప్పుడు నాకు హెల్ప్ చేసింది నితిన్. నేను చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు, నీ వెనకాల నేను ఉన్నాను కదా అని నన్ను పట్టుకుని నాకు ఫస్టు ఛాన్స్ ఇచ్చింది నితిన్. అందువలన ఆయనను ఎప్పటికీ మరచిపోను. కొరియోగ్రఫర్ గా నా లైఫ్ లో నేను ఏది సంపాదించుకున్నా అది ఆయన ఇచ్చినదే.
ఏ హీరో సాంగ్ కోసమైనా ప్రాణం పెట్టే చేస్తాను .. ఇష్టమైన హీరోల పట్ల ఇంకొంచెం అనేది ఒకటి ఉంటుంది కదా .. ఆ ఇంకొంచెం నితిన్ విషయంలో ఉంటుంది. చాలా రోజుల తరువాత మళ్లీ ఆయనతో కలిసి ఒక సాంగ్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అంజలి చేసిన ఐటమ్ సాంగ్ ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుంది. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నాను .. ట్రై చేస్తూనే ఉంటాను .. మీ అందరినీ అలరించడానికి.
నాకు కల్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమనేది మీకు తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకి సంబంధించిన ప్రస్తావన లేకపోయినప్పటికీ ఆయన మేనరిజం ఈ పాటలో ఉండేలా చూశాను. అది అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి .. ఎందుకంటే ఇంతమంది డాన్సర్స్ కావాలంటే ఇచ్చారు. ఈ సాంగ్ కి రీల్స్ చేయడమంటే నన్ను ఎంకరేజ్ చేయడమే. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.