Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: న‌ట‌వార‌సురాళ్ల‌తో ఆ ఫోజులేంటి క‌ర‌ణ్‌?

By:  Tupaki Desk   |   25 Oct 2022 3:54 AM GMT
ఫోటో స్టోరి: న‌ట‌వార‌సురాళ్ల‌తో ఆ ఫోజులేంటి క‌ర‌ణ్‌?
X
న‌ట‌వార‌సురాళ్ల‌ను ప‌రిచ‌యం చేయ‌డంలో క‌ర‌ణ్ జోహార్ కి ఉన్న అరుదైన‌ రికార్డ్ గురించి తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరోల వార‌సులు.. అగ్ర నిర్మాత‌ల కుమార్తెల‌ను అత‌డు క‌థానాయిక‌లుగా ప‌రిచ‌యం చేయ‌డ‌మే గాక వారి కెరీర్ ఎదుగుద‌ల‌కు వెన్నుద‌న్నుగా నిలిచాడు. ఇలాంటి బంధుప్రీతిపై క్వీన్ కంగ‌న ర‌నౌత్ స‌హా ప‌లువురు తార‌లు ప్ర‌తిసారీ ఘాటైన విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ మాఫియా ఎవ‌రినీ ఎద‌గ‌నివ్వ‌ద‌ని ఇందులో క‌ర‌ణ్ ఒక స‌భ్యుడ‌ని కూడా కంగ‌న విమ‌ర్శించింది.

అదంతా అటుంచితే ఎవ‌రు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా క‌ర‌ణ్ త‌న ప‌నిని ఆప‌డు. తాను ఏం చేయాలో అది చేసుకుంటూ ముందుకు వెళుతుంటాడు. పండ‌గ‌లు ప‌బ్బాల వేళ అంద‌రినీ పిలిచి పార్టీలివ్వ‌డం ఘ‌నంగా సెల‌బ్రేట్ చేయ‌డం అత‌డి హాబీ. ముఖ్యంగా తాను తెర‌కు ప‌రిచ‌యం చేసిన అందాల న‌ట‌వార‌సురాళ్ల‌తో అత‌డి అనుబంధం అంతే ప్ర‌త్యేక‌మైన‌ది. వారంద‌రినీ త‌మ బిడ్డ‌లుగా అత‌డు చూసుకుంటాడు. వారి జీవితంలో ప్ర‌తి క్ష‌ణాన్ని అత‌డు డిజైన్ చేస్తున్నాడు. అందుకే అత‌డిని గురువుగా తండ్రిగా భావించి వారంతా గౌర‌విస్తారు.

దీపావ‌ళి పండ‌గ రోజు ఇదిగో ఇలా గూరూజీ క‌ర‌ణ్ జోహార్ తో న‌ట‌వార‌సురాళ్లంతా ఫోటోలు దిగారు. అవ‌న్నీ అంత‌ర్జాలంలోకి దూసుకొచ్చాయి. క‌ర‌ణ్ తో పాటు జాన్వీ క‌పూర్- సారా అలీఖాన్- అన‌న్య పాండే ఇలా కెమెరాల‌కు ఫోజులివ్వ‌గా ఈ ఫ్రేమ్ ఎంతో అందంగా కుదిరింది. ఇదే వేడుక‌లో సారా అలీఖాన్ సోద‌రుడు ఇబ్ర‌హీం అలీఖాన్ అలాగే యువ‌హీరో వ‌రుణ్ ధావ‌న్ కూడా పాల్గొన్నారు. సోద‌రుడు ఇబ్ర‌హీం అలీఖాన్ అచ్చుగుద్దిన‌ట్టు సైఫ్ నే త‌ల‌పిస్తుండ‌గా.. సారా అలీఖాన్ త‌న సోద‌రుడితో క‌లిసి కొన్ని ఫోటోలు దిగింది. అవ‌న్నీ ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్ స్టాగ్రామ్ లో దీపావళి సందర్భంగా మ‌రో ప్ర‌త‌యేక చిత్రాన్ని షేర్ చేసారు. ఇందులో త‌న‌ పిల్లలు యష్ - రూహి.. త‌న త‌ల్లిగారైన‌ హిరూ జోహార్ క‌నిపించారు. ద‌ర్శకుడు మనీష్ మల్హోత్రా రూపొందించిన కలర్-కోఆర్డినేటెడ్ దుస్తులను దీపాల పండుగ కోసం వీరంతా ధరించారు.

ఈ ఫోటోల‌తో పాటు క‌ర‌ణ్ ఇలా వ్యాఖ్యానించాడు. ``నా ప్రపంచం నుండి మీకు దీపావళి శుభాకాంక్షలు! మాకోసం అందంగా సమన్వయంతో కూడిన దుస్తులను డిజైన్ చేసిన మ‌నీష్ కి ధన్యవాదాలు. మీ అందరికీ చాలా ప్రేమ కాంతిని పంపుతున్నందుకు మీ అంద‌రికీ ఐ ల‌వ్ యు`` అంటూ ఆనందం వ్య‌క్తం చేసారు. అభిమానుల‌పై త‌న ప్రేమ‌ను ఆవిష్క‌రిస్తూ ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేసారు.

ఈ ఫోటోలుకు బాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి వెంట‌నే స్పంద‌న‌లు వ‌చ్చాయి. అనిల్ కపూర్ - అమృత అరోరా- మహీప్ కపూర్- ఈషా గుప్తా- బి ప్రాక్ వంటి ప్రముఖులు .. ఇతర బాలీవుడ్ ప్రముఖులు పోస్ట్ పై కామెంట్లు చేసారు. KJoకి శుభాకాంక్షలు తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కరణ్ తదుపరి చిత్రం `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ`లో రణవీర్ సింగ్ - అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జయ బచ్చన్- షబానా అజ్మీ- ధర్మేంద్ర కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. క‌ర‌ణ్ వ‌రుస‌గా భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు స‌హ‌నిర్మాత‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. పూరి తెర‌కెక్కించిన `లైగ‌ర్` సినిమాతో ప‌రాజ‌యం చ‌వి చూడ‌డం అత‌డిని నిరాశ‌ప‌రిచింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.