Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : మెరిసేటి జాబిలి నువ్వే.. కురిసేటి వెన్నెల నువ్వే..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 9:30 AM GMT
ఫోటో స్టోరీ : మెరిసేటి జాబిలి నువ్వే.. కురిసేటి వెన్నెల నువ్వే..!
X
బాలీవుడ్ హీరోయిన్స్ లో రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్న బ్యూటీ ఎవరంటే అందరు జాన్వి కపూర్ పేరే చెబుతారు. స్టార్ కిడ్ గా తెరంగేట్రం చేసిన జాన్వి తన ప్రతి మూమెంట్ తో బీ టౌన్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. కేవలం సినిమాలే కాదు తన పర్సనల్ యాక్టివిటీస్ కూడా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తుంది. ఇటీవలే మిలి సినిమాతో వచ్చిన జాన్వి కపూర్ సినిమాలో ఆమె నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది. సినిమాలతో సంబంధం లేకుండా జాన్వి భారీ క్రేజ్ తెచ్చుకుంటుంది. అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

జాన్వి కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్ అనిపించడమే పనిగా పెట్టుకున్నారు. లేటెస్ట్ గా జాన్వి కపూర్ బ్యూటిఫుల్ లెహెంగా తో మెరుపులు చిందించింది. షిమ్మెరీ లెహెంగా డిజైనర్ వేర్ తో ఎట్రాక్ట్ చేస్తుంది జాన్వి కపూర్. ఈమధ్యనే సోషల్ మీడియాలో తను సరదాకి మాత్రమే ఫోటో షూట్స్ షేర్ చేస్తానని వాటి వల్లే తన ఈ.ఎం.ఐ లు కడుతున్నా అని కామెడీ చేసిన జాన్వి మరోసారి తన గ్లామర్ తో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చింది. ఫోటో షూట్స్ అంటే స్కిన్ షో మాత్రమే కాదు ఇలా నిండా కప్పుకుని కూడా అందాలను ప్రదర్శించొచ్చు అని చెబుతుంది జాన్వి కపూర్.

శ్రీదేవి కూతురుగా సినిమాల కన్నా సోషల్ మీడియా ఫాలోవర్స్ తో మాత్రం తన ఫాం కొనసాగిస్తుంది జాన్వి. ఇక జాన్వి లేటెస్ట్ ఫోటోలు చూసి మెరిసేటి జాబిలి నువ్వే.. కురిసేటి వెన్నెల నువ్వే అంటూ ఫాలోవర్స్ ప్రణయ గీతాలు పాడటం కామన్ అని చెప్పొచ్చు.

అంతేకాదు జాన్వి అసలు నీకిది ఏమన్నా బాగుందా నువిలా రెచ్చిపోతే మా లాంటి కుర్రాళ్ల పరిస్థితి ఏంటని అంటూ చిలిపి కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఎవరేమి అనుకున్నా అనుకోకపోయినా జాన్వి మాత్రం తన లెక్క తనదే అనేలా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

ఇక సౌత్ సినిమాల మీద జాన్వి ఆసక్తి అందరికి తెలిసిందే. అమ్మ శ్రీదేవిలానే ఇక్కడ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది జాన్వి. తెలుగు సినిమాల మీద తన స్పెషల్ ఇంట్రెస్ట్ గురించి ఇప్పటికే చాలాసార్లు ఓపెన్ అయ్యింది. త్వరలోనే జాన్వి తొలి తెలుగు సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఆమెకి స్టార్ స్టేటస్ దక్కడం పక్కా అనేస్తున్నారు నెటిజెన్లు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.