Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం.. ఆ స్టార్ కుటుంబాన్ని వదల్లేదు..

By:  Tupaki Desk   |   12 Jun 2020 5:20 PM IST
కరోనా కల్లోలం.. ఆ స్టార్ కుటుంబాన్ని వదల్లేదు..
X
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. తొలిచిత్రం హిట్ తో ఇక బాలీవుడ్ లో వెనుదిరిగి చూసుకోలేదు.

అయితే ప్రస్తుతం కరోనా మాత్రం జాహ్నవిని భయపెట్టిందట.. లాక్ డౌన్ తో షూటింగ్ లు నిలిచి కుటుంబ సభ్యులతో ఇంట్లోనే సరదాగా గడుపుతున్న జాహ్నవికి కరోనా చుక్కలు చూపించిందట..

తమ ఇంట్లో పనిచేస్తున్న వారిలో ఒకరికి కరోనా సోకినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులంతా హడలి చచ్చామని.. భయంతో బిగుసుకుపోయామన్నారు. కుటుంబ సభ్యులంతా కరోనా టెస్టులు చేయించుకోక తప్పలేదని జాహ్నవి వాపోయింది.

తమతోపాటు ఇంట్లోని ఇతర పనిమనుషులకు కూడా కరోనా టెస్టులు చేసినట్టు జాహ్నవి తెలిపింది. ఈ టెస్టుల్లో ఇంట్లో పనిచేసే ఇద్దరికి పాజిటివ్ రావడం తమను షాక్ కు గురిచేసిందని చెప్పుకొచ్చింది.

కరోనా సోకిన వారి గురించి వీడియోలు.. వార్తలు రకరకాలు విన్న తనకు తన ఇంట్లోనే కరోనా సోకడంతో భయపడ్డానని జాహ్నవి తెలిపింది. ప్రస్తుతం తమ ముగ్గురు పనిమనుషులు కరోనా నుంచి కోలుకొని బయటపడ్డారని తెలిపింది. తన తండ్రి, చెల్లెలి బాధ్యతలను తనే తీసుకున్నట్టు జాహ్నవి తెలిపింది. వారి అవసరాలను తానే నెరవేర్చినట్టు తెలిపింది. ఆ తర్వాత తమ ఇంట్లో పనిమనుషులను బంద్ చేసి తానే అన్ని పనులు చేసినట్టు జాహ్నవి వివరించింది.