Begin typing your search above and press return to search.

బెట్టువీడిన జాన్వీ క‌పూర్ ఫైన‌ల్ గా ఎన్టీఆర్ తో..?

By:  Tupaki Desk   |   16 Dec 2022 9:30 AM GMT
బెట్టువీడిన జాన్వీ క‌పూర్ ఫైన‌ల్ గా ఎన్టీఆర్ తో..?
X
గ‌త కొంత కాలంగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తానంటూ ఊరిస్తున్న బాలీవుడ్ బ్యూటీ, దివంగ‌త అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ ఎప్ప‌టి క‌ప్పుడు దాట వేస్తూ వ‌స్తోంది. ఏ స్టార్ ప్రొడ్యూస‌ర్ త‌న‌ని తెలుగులో ప‌రిచ‌యం చేయాల‌ని సంప్ర‌దించినా షాకిచ్చే రెమ్యున‌రేష‌న్ ని డియాండ్ చేస్తూ నిర్మాత‌ల‌ని భ‌య‌పెడుతూ వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జాన్వీని తెలుగులో ప‌రిచ‌యం చేయాల‌ని, శ్రీ‌దేవి క్రేజ్ ని వాడుకోవాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా జాన్వీ క‌పూర్ రెమ్యున‌రేష‌న్ తో బెద‌ర‌గొడుతూ వ‌స్తోంది.

రార‌మ్మ‌ని టాలీవుడ్ పిలుస్తున్నా బెట్టుచేస్తూ వ‌స్తున్న జాన్వీ క‌పూర్ మొత్తానికి బెట్టు వీడిన‌ట్టుగా క‌నిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. 'RRR'తో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ పాపులారిటీని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకుని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు. ఇంత‌టి క్రేజీ మూవీ త‌రువాత త‌న త‌దుప‌రి మూవీ కూడా అదే స్థాయిలో పాన్ ఇండియా మూవీగా వుండాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు.

'RRR' త‌రువాత ఎన్టీఆర్ త‌న 30వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ఎన్టీఆర్ ఆర్ట్స్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ఫ‌ణ‌లో ఈ భారీ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

గ‌త కొన్ని నెల‌లుగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ప‌ట్టాలెక్కుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాత్రం 'ఆచార్య‌' ఇచ్చిన షాక్ కార‌ణంగా ప్ర‌తీ విష‌యంపై చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వ‌స్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వ‌స్తోంది. రీసెంట్ గా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని మొద‌లు పెట్టిన చిత్ర బృందం తాజాగా ఫిల్మ్ న‌గ‌ర్ లో ఆఫీసుని కూడా ప్రారంభించేసింది. తాజాగా #NTR30 కోసం హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తెలిసింది. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి హీరోయిన్ గా వినిపిస్తున్న పేరు జాన్వీ క‌పూర్.. త‌న‌నే ఫైన‌ల్ గా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఫైన‌ల్ చేయ‌డంతో అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

గ‌త కొంత కాలంగా బాలీవుడ్ లో వ‌రుస ఫ్లాపుల్ని సొంతం చేసుకుంటున్న జాన్వీ క‌పూర్ ఫైన‌ల్ గా త‌న బెట్టువీడి ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేయ‌డానికి రెడీ అయిన‌ట్టుగా చెబుతున్నారు. దీంతో ఎన్టీఆర్ 30 ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు నెట్టింట వైర‌ల్ గా మారిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే నెల ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభించి ఫిబ్ర‌వరి నెంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ని మొద‌లు పెట్ట‌బోతున్నార‌ని తెలిసింది. మ‌రి జాన్వీ ఎంట్రీతో ఇప్ప‌టికైనా ఎన్టీఆర్ 30 స్పీడందుకుంటుందా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.