Begin typing your search above and press return to search.
అప్పుడే కదా జీవితంలో కిక్ ఉండేది - జాన్వీ
By: Tupaki Desk | 5 Feb 2021 2:40 PM IST‘జాన్వీ కపూర్’ అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా తెరంగేట్రం చేసింది. ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. 'ధడక్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేన్’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో తన నటకు గానూ విమర్శకుల ప్రసంశలు అందుకుంది జాన్వీ. ఈ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం.. బాలీవుడ్ లో జాన్వీ మంచి స్వింగ్ లో ఉంది. చేసిన రెండు సినిమాలూ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక.. ఇప్పటికే ‘రూహీ అఫ్జానా’ చిత్రంతోపాటు ‘దోస్తానా 2’ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతోపాటు మరో సినిమాలోనూ నటిస్తోంది జాన్వీ కపూర్. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న 'గుడ్ లక్ జెర్రీ' మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
కాగా.. తన కెరీర్ గురించి ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలనుందో తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. ‘నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని అనుకుంటున్నాను. ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలి. అప్పుడే కదా కిక్ ఉంటుంది?’ అని అంటోంది జాన్వీ. భవిష్యత్తులో మంచి మంచి కథలు ఎంచుకొని సినిమాలు చేస్తానని చెబుతోంది.