Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నాన్న కూచీ చ‌మ్మ చ‌క్క‌

By:  Tupaki Desk   |   24 Sep 2019 4:56 AM GMT
ఫోటో స్టోరి: నాన్న కూచీ చ‌మ్మ చ‌క్క‌
X
ధ‌డ‌క్ చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన జాన్వీ క‌పూర్ కెరీర్ ప్ర‌స్తుతం స్వింగులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌దాని వెంట ఒక‌టిగా అర‌డ‌జ‌ను ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. వీటిలో ఇప్ప‌టికే వైమానిక ద‌ళ అధికారిణి `గుంజ‌న్ స‌క్సేనా- ది కార్గిల్ గ‌ర్ల్` బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ‌ పూర్త‌వుతోంది. అలాగే హార‌ర్ కామెడీ `రుహీ అఫ్జా`లో ద్విపాత్రాభిన‌యం చేస్తోంది. క‌ర‌ణ్ జోహార్ తెరకెక్కించ‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `త‌క్త్` త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లు కానుంది. అలాగే బ్లాక్ బ‌స్ట‌ర్ `దోస్తానా` సీక్వెల్లోనూ కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న న‌టించ‌నుంది.

ఇంత బిజీగా ఉండే ఈ అమ్మ‌డికి ఖాళీ స‌మ‌యం చిక్క‌డం చాలా అరుదు. ఇలాంటి బిజీ షెడ్యూల్ న‌డుమ చిన్న‌ బ్రేక్ దొరికినా ఆ స‌మ‌యాన్ని త‌న ఫ్యామిలీ కోసం కేటాయిస్తోంది. లేటెస్టుగా త‌న ఇన్ స్టాలో ఓ ఆస‌క్తిక‌ర ఫోటోని షేర్ చేసింది. న‌ట‌శిక్ష‌ణ స‌హా పై చ‌దువుల కోసం న్యూయార్క్ కి వెళ్లిన‌ త‌న సోద‌రి చెంత‌కు ర‌య్‌! మ‌ని వెళ్లి వాలిపోయింది. అక్క‌డ‌ డాడ్ బోనీక‌పూర్ తో క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. దీనికి ఫైన‌ల్లీ! అంటూ సింపుల్ క్యాప్ష‌న్ ఇచ్చింది. చిట్టి చెల్లిని చూడ‌లేనిదే ఒంట‌రిగా ఉండ‌లేను! అని జాన్వీ చెప్ప‌క‌నే చెప్పేసింది సో క్యూట్ జాన్వీ.

అంతా బాగానే ఉంది. అక్క చెల్లెళ్ల అనుబంధం మురిపిస్తోంది. జాన్వీ-ఖుషీ సిస్ట‌ర్స్ అనుబంధాన్ని స్వ‌ర్గ‌లోకంలో ఉన్న అతిలోక సుంద‌రి వీక్షిస్తూనే ఉంటారు. అక్క‌డినుంచి వార‌సురాళ్ల‌కు ఆశీస్సులు అందుతుంటాయి. జాన్వీని క‌థానాయిక యాటిట్యూడ్ తో ఫేజ్ 3 ప్ర‌పంచ‌పు రారాణిగా మ‌లిచిన గురువు మామ్ శ్రీ‌దేవి. అయితే ఖుషీకి మాత్రం ఆ ఛాన్స్ లేదు. అన్నీ తానే అయ్యి జాన్వీనే నేర్పించాల్సి ఉంటుంది. ఎలానూ చెల్లెమ్మ ఖుషీ క‌పూర్ త్వ‌ర‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది కాబ‌ట్టి.. ఇంత గారాంగా చూసుకునే అక్క ఉండ‌డం అదృష్ట‌మేన‌ని చెప్పాలి. ఖుషీ డెబ్యూ నాయిక‌గా ప‌రిచ‌యం అయ్యేప్ప‌టికి జాన్వీ అన్ని ర‌కాలుగా అనుభ‌వం సంపాదించేస్తుంది కాబ‌ట్టి అది సిస్ కు ప్ల‌స్ కానుంద‌న్న‌మాట‌.