Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ పై జాన్వీ క్ర‌ష్.. ప‌ట్టించుకోడేం?

By:  Tupaki Desk   |   25 Dec 2019 4:28 AM GMT
రౌడీ స్టార్ పై జాన్వీ క్ర‌ష్.. ప‌ట్టించుకోడేం?
X
బాలీవుడ్ క్రేజీ గాళ్ జాన్వీ క‌పూర్ మ‌న రౌడీ స్టార్ పై మ‌న‌సు పారేసుకుంద‌ట‌. త‌ను ఏ షోకు వెళ్లినా ఎవ‌రి గురించి మాట్లాడినా.. చివ‌రికి రౌడీ హీరో విజ‌య్ దేవ‌రకొండ గురించి మాత్రం మాట్లాడ‌కుండా ఉండ‌ లేక‌పోతోంది. ఇటీవ‌ల న‌టి నేహా దూపియా నిర్వ‌హిస్తున్న `నో ఫిల్ట‌ర్ నేహా`అనే కార్య్ర‌మం లో జాన్వీక‌పూర్ పాల్గొంది. త‌న మ‌న‌సులో దాచుకున్న భావాల్ని ఎలాంటి ఫిల్ట‌ర్ లేకుండా బ‌య‌ట‌ పెట్టేసింది. ప‌నిలో ప‌నిగా త‌న రూమ‌ర్డ్ బోయ్ ఫ్రెండ్ ఇషాన్ క‌త్త‌ర్ గురించి కూడా కొన్ని ర‌హ‌స్యాల్ని బ‌య‌ట‌ పెట్టేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఇషాన్ స్వ‌చ్ఛ‌మైన భావోద్వేగాలున్న వాడ‌ని.. అత‌నిది నిర్మ‌ల‌మైన మ‌న‌సు అని పొగిడేసింది. స్వ‌చ్ఛ‌మైన హృద‌యం.. అంద‌మైన క‌ళ్లు ఉన్న కుర్రాడు అంటూ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తింది. అత‌ని క‌ళ్లుల్లో చాలా క‌ల‌లున్నాయ‌ని.. అత‌నికి ఓ క్యాప్ గిఫ్ట్‌ గా ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని అంది. అత‌డి కోసం ఓ క్యాప్‌ని కొట్టేశాన‌ని.. దాన్ని మా ఇంట్లో భ‌ద్రంగా దాచాన‌ని చెప్పుకొచ్చింది. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి మాట్లాడుతూ.. అతని పై చాలా రోజులుగా క్ర‌ష్ వుందని.. ఇప్ప‌టికే చాలా ఫీల‌ర్స్ వ‌దిలాను కానీ.. ఇంత వ‌ర‌కు అత‌డి నుంచి ఏలాంటి అప్ డేట్ రాలేద‌ని కొంటెగా స‌మాధానం చెప్పింది. అంటే విజ‌య్ నుంచి త‌న‌కు ఇంకా ఎలాంటి ఆఫ‌ర్ రాలేద‌ని ఓపెన్ గానే చెప్పేసింద‌న్న మాట‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ `ఫైట‌ర్‌` పేరు తో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. క‌ర‌ణ్ జోహార్ స‌పోర్ట్ గా నిలుస్తున్న ఈ మూవీలో విజ‌య్ కి జోడీగా జాన్వీని పూరి అడుగుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జాన్వీ తాజా రెస్పాన్స్ ని బ‌ట్టి చూస్తుంటే విజ‌య్ దేవ‌ర కొండ `ఫైట‌ర్‌` కోసం జాన్వీ ఎదురు చూస్తోంద‌నే అర్థం. ఈ ఇద్ద‌రు క‌లిస్తే సిల్వ‌ర్ స్క్రీన్ మెంట‌లెక్కి పోవ‌డం ఖాయ‌మ‌ని బాలీవుడ్- టాలీవుడ్ స‌ర్కిల్స్ లో రౌడీ ఫ్యాన్స్ భావిస్తున్నారు మ‌రి.