Begin typing your search above and press return to search.
హాలీవుడ్ కు వెళ్తున్నాను.. వాళ్లంటే నాకు చాలా ఇష్టంః జాన్వీ కపూర్
By: Tupaki Desk | 27 Feb 2021 8:00 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది జాన్వీకపూర్. ‘ధడక్’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేన్’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో తన నటకు గానూ విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ మూవీలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కయి.
ప్రస్తుతం.. మంచి స్వింగ్ లో ఉంది జాన్వీ. చేసిన రెండు సినిమాలూ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. జాన్వీ నటించిన ‘రూహీ అఫ్జానా’ అనే హారర్ కామెడీ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కాగా.. రూహీ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది జాన్వీ. ఈ సందర్భంగా తాను హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ఆడిషన్స్ కూడా కంప్లీట్ చేసినట్టు ప్రకటించింది జాన్వీ.
తాను ఈ మధ్యనే రెండు హాలీవుడ్ చిత్రాల ఆడిషన్స్ కు వెళ్లొచ్చినట్టు చెప్పింది. ఈ సందర్భంగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడంపై తన ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంది. ‘సరిహద్దులు లేని కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం. మన పరిధులు విస్తరించడానికి, విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి గ్లోబల్ యాక్టర్ గా మారడం ఒక అద్భుతమైన మార్గం” అని చెప్పింది జాన్వీ.
కాగా.. బాలీవుడ్ లో ‘రూహి అఫ్జానా’ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి ‘గుడ్ లక్ జెర్రీ’ కగా.. రెండోది ‘దోస్తానా-2’. ఈ రెండు చిత్రాలూ ప్రస్తుతం సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి.