Begin typing your search above and press return to search.

న‌ట‌వార‌సురాలి ఫోన్ లో టాప్ సీక్రెట్ సంథింగ్ సంథింగ్

By:  Tupaki Desk   |   31 Jan 2021 12:00 PM IST
న‌ట‌వార‌సురాలి ఫోన్ లో టాప్ సీక్రెట్ సంథింగ్ సంథింగ్
X
సంథింగ్ సంథింగ్ ఏదైనా లేనిదే స్టార్ కిడ్స్ ఫోన్ వ్య‌వ‌హారం ఉండ‌దు. ప్ర‌స్తుతం జాన్వి కపూర్ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ ఆ వాల్ పేప‌ర్ లో ఏం ఉంది? అన్న‌ది ప‌రిశీలిస్తే.. త‌న‌ చిన్ననాటి జ్ఞాప‌కం అది. ఎన్న‌టికీ మ‌ర‌పురాని త‌న‌ తల్లి శ్రీదేవి ఒడిలో కూర్చుని లాల‌న‌గా చూస్తున్న క్యూట్ ఫోటో అది. శ్రీదేవి బంగారు వ‌ర్ణం చీర ధరించి ఎంతో అందంగా క‌నిపిస్తుంటే.. జాన్వి చాలా ల‌వ్ లీగా ప‌ట్టు వ‌స్త్రాల్లో కనబడుతోంది. శ్రీదేవి ఫోటోతో జాన్వి ఫోన్ స్క్రీన్ ఆశ్చర్యం కలిగించకపోయినా తన తల్లిని ఎంత‌గా ఆరాధిస్తుందో ఎంత‌గా మిస్ అవుతుందో ఈ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది.

అతిలోక సుంద‌రి శ్రీదేవి అంతర్థాన‌మై దాదాపు మూడేళ్ళు అయింది. దుబాయ్ ట్రాజిక్ ఘ‌ట‌న‌ను ఇంకా ఆమె అభిమానులు మ‌రువ‌నే లేదు. ఇక జాన్వీని మామ్ ఎలా చూడాల‌నుకున్నారో ఆ స్థాయి స్టార్ గా ఎదిగేస్తోంది. గుంజ‌న్ స‌క్సేనా స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో జాన్వీ బిజీగా ఉంది. దోస్తానా 2.. త‌క్త్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది. ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది.