Begin typing your search above and press return to search.
వాలు చూపులతో వలలు వేస్తున్న జాన్వీ
By: Tupaki Desk | 26 Feb 2021 11:15 AM ISTబ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది జాన్వీ కపూర్. తన చిత్రం `గుడ్ లక్ జెర్రీ` సెట్స్ నుండి ఇంతకుముందు రకరకాల ఫోటోల్ని షేర్ చేయగా వైరల్ అయ్యాయి. మరోవైపు ఫ్యాషన్ అండ్ స్టైల్స్ పరంగా జాన్వీ ప్రయోగాత్మక ఫోటోషూట్లు యువతరంలోకి దూసుకెళుతున్నాయి.
ప్రస్తుతం రుహీ అఫ్జానా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా జాన్వీ సరికొత్త పంథాలో ప్రచారానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఇంతకుముందు డే వన్ ప్రచారానికి సంబంధించి ఓ ఫోటోని షేర్ చేసింది. తాజాగా డే 2 అంటూ మరో హాట్ ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ ఫోటోషూట్ లో జాన్వీ పింక్ బాటమ్ .. పర్పుల్ టాప్ తో కనిపించింది. జాన్వీ కిల్లర్ లుక్ ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక చారెడేసి కళ్లతో అలా వాలు చూపులు చూస్తూ వాలలు వేస్తోంది! అంటూ యూత్ ఒకటే కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఇషాన్ ఖత్తర్ సరసన `ధడక్` చిత్రంతో జాన్వీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్.. ఘోస్ట్ స్టోరీస్ వంటి నెట్ ఫ్లిక్స్ చిత్రాలలో నటించింది. హర్రర్ కామెడీ రూహి అఫ్జా త్వరలో రిలీజ్ కి వస్తోంది. కార్తీక్ ఆర్యన్ తో దోస్తానా 2 సెట్స్ పై ఉంది.