Begin typing your search above and press return to search.
80లలో శ్రీదేవి ఫ్యాషన్ నే జాన్వీ ఫాలో చేస్తోందా?
By: Tupaki Desk | 10 Feb 2021 1:11 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ `మామ్` ఆశల్ని వమ్ము కానివ్వకుండా సినీప్రపంచంలో కథానాయికగా దూసుకుపోతోంది. అయితే నాటి మేటి ఫ్యాషనిస్టాగా శ్రీదేవి వారసత్వాన్ని కూడా జాన్వీ నిలబెడుతోందా? అంటే అవుననే ఫ్యాన్స్ అంటున్నారు.
ఇటీవలి కాలంలో జాన్వీ ఫోటోషూట్లు కాస్ట్యూమ్ సెలెక్షన్ పరిశీలిస్తే.. నాటి రోజుల్లో శ్రీదేవి సెలక్షన్ కి నియరెస్ట్ గా ఉందనే కామెంట్లు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. `ఓల్డ్ డేస్ గోల్డెన్ డేస్` అన్న చందంగా నాటి స్టైలింగ్ ఇప్పటికీ సజీవంగానే ఉంది అంటే జాన్వీ లాంటి నవతరం నాయికలు ఇప్పటికీ ఆ ట్రెండ్ ని ఇష్టపడుతున్నారు కాబట్టే.
తాజాగా జాన్వీ ధరించిన పింక్ పర్పుల్ ఫ్రాకు లేటెస్ట్ మోడల్ కానేకాదు. 80లలో శ్రీదేవి ధరించిన స్పెషల్ చిక్ డ్రెస్ అన్నది ఫ్యాన్స్ ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. ఆ రోజుల్లోనే శ్రీదేవి.. భానుప్రియ.. రాధ అద్భుతమైన డిజైనర్ డ్రెస్సుల్లో మెరిసిపోయేవారు. నేటితరానికి సీనియర్ నాయికలు స్ఫూర్తిగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సమకాలీన కథానాయికల్లో శ్రీదేవి బెస్ట్ ఫ్యాషనిస్టాగా రాజ్యమేలారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ ఇంక్విలాబ్-1984 (అమితాబ్ హీరో) చిత్రంలో శ్రీదేవి పింక్ ఫ్రాక్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వారతస్వాన్ని జాన్వీ కాపాడుతోందనే అభిమానులు భావిస్తున్నారు.
కెరీర్ విషయానికి వస్తే.. ధడక్ చిత్రంతో రంగ ప్రవేశం చేసి కార్గిల్ గర్ల్ వరకూ నటవారసురాలు జాన్వీ ప్రయాణం ఎంతో ఎగ్జయిటింగ్ గానే సాగింది. ఇపుడు దోస్తానా 2 - రూహీ అఫ్జా లాంటి క్రేజీ చిత్రాల్లో జాన్వీ నటిస్తోంది. 2021-22 సీజన్ లో ఈ చిత్రాలన్నీ రిలీజ్ కానున్నాయి. దిల్లీలో పంజాబ్ రైతుల నిరసనల వల్ల జాన్వీ నటిస్తున్న జగ్ జగ్ జియో షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.