Begin typing your search above and press return to search.

ఇదే మూడ్ లో కాస్త టాలీవుడ్ నీ చూడ‌మ్మా!

By:  Tupaki Desk   |   8 Feb 2021 4:45 PM IST
ఇదే మూడ్ లో కాస్త టాలీవుడ్ నీ చూడ‌మ్మా!
X
చంటిగాడి కంట పడితే `చూపుల్తో గుచ్చి గుచ్చి చంప‌కే` అంటూ సాంగేసుకుంటాడేమో! మాస్ రాజాల‌కైనా క్లాస్ బాబుల‌కైనా గుండెల్లో గుబులు రేపే అందం ఈ అమ్మ‌డి సొంతం. వాడి వేడి చూపుల‌తో గుచ్చేస్తున్న ఈ బ్యూటీ ఎవ‌రో ప‌రిచ‌యం అవ‌స‌ర‌మే లేదు.

అందాల జాన్వీ క‌పూర్ ఆ న‌వ‌య‌వ్వ‌ని..ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉంది ఈ బ్యూటీ. సోష‌ల్ మీడియాల్లోనూ ఆ రేంజులోనే చెల‌రేగుతోంది. జాన్వీ తాజా ఫోటోషూట్ కి `#మూడ్.. రియ‌లైజ్ అయినపుడు!` అంటూ అదిరిపోయే క్యాప్ష‌న్ ఇచ్చింది. మండే ఈజ్ ఆల్మోస్ట్ హియ‌ర్ అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది.

బాలీవుడ్ లో సోన‌మ్ క‌పూర్.. త‌ర్వాత మ‌ళ్లీ ఆ ఫ్యామిలీ నుంచి బెస్ట్ ఫ్యాష‌నిస్టాగా పాపుల‌రైంది జాన్వీ. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీకి చెల్లెలు ఖుషీ క‌పూర్ నుంచి తీవ్ర మైన పోటీ ఉండ‌నుంది. జాన్వీ-ఖుషీ సిస్ట‌ర్స్ ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో అభిమానుల కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తున్నారు. జాన్వీ కెరీర్ సంగ‌తి చూస్తే దోస్తానా 2 .. రూహీ అఫ్జానా వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదే మూడ్ లో కాస్త టాలీవుడ్ నీ చూడ‌మ్మా! అంటూ మ‌న యూత్ ఆహ్వానిస్తున్నారు. 2022లోపే జాన్వీ టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతుంద‌నే అభిమానులు భావిస్తున్నారు. క‌ర‌ణ్ హిస్టారిక‌ల్ మూవీ త‌క్త్ మూవీ చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింద‌ని క‌థ‌నాలొచ్చాయి