Begin typing your search above and press return to search.

ఒంట‌రి దీవుల్లో జాన్వీ స్పెష‌ల్ ఫోటోషూట్

By:  Tupaki Desk   |   1 May 2021 2:59 AM GMT
ఒంట‌రి దీవుల్లో జాన్వీ స్పెష‌ల్ ఫోటోషూట్
X
శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో అభిమానుల కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌ఖ్యాత ట్రావెల్ ప్ల‌స్ లీజర్ కవర్ షూట్ కోసం జాన్వీ వేడెక్కించే ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి.

భారతదేశంలో కోవిడ్ 19 సెకండ్ వేవ్ ప్రారంభం కాక‌ముందే చేసిన ఫోటోషూట్ ఇది. మాల్దీవుల్లో అంద‌మైన‌ బ్లూ వాట‌ర్స్ లొకేష‌న్ల‌లో ఈ ఫోటోషూట్ చేశారు. ఇక ఈ ఫోటోషూట్ లో వేడెక్కించే కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

జాన్వి కపూర్ ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో బులుగు స‌ముద్రం ప‌రిస‌రాల్లో మత్స్యకన్యలా మారిపోయింది. ఈ ఫోటోల‌లో బ్లూ డెనిమ్ ఇన్న‌ర్ .. ప్రింటెడ్ ఫ్లోర‌ల్ కోట్ తో జాన్వీ ఇచ్చిన ఫోజు నెవ్వ‌ర్ బిఫోర్ అంటూ కితాబిచ్చేస్తోంది యూత్. అలాగే ఆకుపచ్చ మోనోకినిలో .. నీలిరంగు బికినీలోనూ అదిరిపోయే భంగిమ‌ల‌తో కుర్ర‌బ్యూటీ వేడెక్కించింది. మాల్దీవుల్లో ఎంతో విలాస‌వంత‌మైన‌ విల్లా రిసార్ట్ డెక్ మీద కొంత ఫోటోషూట్ చేశారు. బీచ్ ఇసుక‌లోనూ జాన్వీ ఇచ్చిన ఫోజులు హాటెస్ట్ ట్రీట్ అని చెప్పాలి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వి కపూర్ తదుపరి బ్లాక్ కామెడీ `గుడ్ లక్ జెర్రీ`లో కనిపించనున్నారు. దోస్తానా 2 చిత్రీక‌ర‌ణ సాగాల్సి ఉంది.