Begin typing your search above and press return to search.

జాన్వీ (Vs) ఖుషీ.. కిస్సీ కిస్సీ ఊ మై బేబీ

By:  Tupaki Desk   |   20 March 2022 3:30 AM GMT
జాన్వీ (Vs) ఖుషీ.. కిస్సీ కిస్సీ ఊ మై బేబీ
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా తెరంగేట్రం చేసిన జాన్వీ క‌పూర్ పై ఆరంభం కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ అన్నిటినీ ప‌టాపంచ‌లు చేస్తూ ఇటీవ‌లి కాలంలో జాన్వీ ఇమేజ్ అమాంతం పెరుగుతోంది. ముఖ్యంగా ఫ్యాష‌న్స్ అండ్ స్టైలింగ్ ప‌రంగా చెల‌రేగుతున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. ఇండ‌స్ట్రీ ఫ్యాష‌నిస్టాగా హాట్ గాళ్ గా యూత్ ని ఒక ఊపు ఊపుతోంది. సోష‌ల్ మీడియాల్లో జాన్వీకి అంత‌కంత‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇక కెరీర్ ప‌రంగానూ జాన్వీ అసాధార‌ణ జ‌ర్నీ సాగిస్తోంది.

ఇక రంగుల మాయా ప్ర‌పంచాన్ని ఎలా ఏలాలో గురువులు క‌ర‌ణ్ జోహార్.. మ‌నీష్ మ‌ల్హోత్రా వంటి వారి నుంచి బోలెడ‌న్ని టిప్స్ ని పొందుతోంది. ఇప్పుడు జాన్వీ బాట‌లోనే త‌న సోద‌రి ఖుషీ క‌పూర్ కూడా అడుగులు వేస్తోంది. తొంద‌ర్లోనే అక్క బాట‌లోనే తాను కూడా పెద్ద స్టార్ కావాల‌ని క‌ల‌లు గంటున్న ఖుషీ ఇటీవ‌లే ఓ బ‌ర్త్ డే పార్టీలో క‌నిపించింది.

ఈ పార్టీలో లైగ‌ర్ టీమ్ సంద‌డి గురించి తెలిసిన‌దే. ఇక‌పోతే సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ ఒక చోట చేరితే ర‌చ్చే ర‌చ్చ అనేందుకు సాంపిల్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలోకి రివీలైంది. జాన్వీ షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ వెబ్ ని షేక్ చేస్తోంది. సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ ఎంతో ఫ‌న్ తో మురిపిస్తున్నారు. ఖుషీ చేతుల‌ను అందుకుని జాన్వీ ఇలా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది. ``కిస్సీ కిస్సీ ఊ మై బేబీ`` అంటూ రొమాంటిక్ ఫోజిచ్చింది. ఇక ఈ వేడుక ఆద్యంతం జాన్వీ మిరుమిట్ల ఫ్రాక్ లో హాట్ లుక్ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే తో పోటీప‌డుతూ జాన్వీ ఇచ్చిన ఎంట్రీ మ‌తులు చెడ‌గొట్టింది. జాన్వీ త‌దుప‌రి తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో రంగ ప్ర‌వేశం చేసేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఖుషీ క‌పూర్ కూడా త‌న సోద‌రిని అనుస‌రిస్తుంద‌నడంలో సందేహం లేదు. ఖుషీ న‌టించే సినిమాని అధికారికంగా బోనీ అండ్ టీమ్ ప్ర‌క‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.