Begin typing your search above and press return to search.

తొలి పైలెట్ వారియ‌ర్‌ బయోపిక్‌

By:  Tupaki Desk   |   26 Dec 2018 1:51 PM GMT
తొలి పైలెట్ వారియ‌ర్‌ బయోపిక్‌
X
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ నటించిన తొలి చిత్రం ధడక్ ఇటీవలె విడుదలై ఘ‌న‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ అభిన‌యానికి - నటన పరంగా మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. ఈ సినిమా తరువాత జాన్వీ లైన‌ప్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్.

జాన్వీ ప్ర‌స్తుతం ఓ రెండు భారీ చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ఇందులో ఒక‌టి బ‌యోపిక్ - వేరొక‌టి భారీ హిస్టారిక‌ల్ మూవీ. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జాన్వీ ఓ పైలెట్ పాత్ర‌లో న‌టించ‌బోతోంద‌ని తెలుస్తోంది. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ - గుంజన్ పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకుంటుంది. ఇక తాజాగా గుంజన్ లుక్ లో ఉన్న జాన్వీ ఫోటో బయటికొచ్చింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

మ‌రోవైపు జాన్వీ ఈ చిత్రం తో పాటు కరణ్ జోహార్ నిర్మించనున్న మల్టీ స్టారర్ మూవీ `తఖ్త్‌’ లో కూడా నటించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా సింహాస‌నం కోసం కొట్టుకునే అన్న‌ద‌మ్ముల క‌థ‌తో తెర‌కెక్కుతోంది. ఇందులో జాన్వీ ఎవ‌రికి పెయిర్‌గా న‌టించ‌నుంది? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. క‌ర‌ణ్ జోహార్ స్వ‌యంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. క‌రీనాక‌పూర్ - ర‌ణ‌వీర్ సింగ్ - ఆలియా భ‌ట్ - భూమి పెడ్నేక‌ర్ - విక్కీ కౌశ‌ల్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఇందులో ఔరంగ జేబ్ పాత్ర గురించి లీక్ అందిన సంగ‌తి తెలిసిందే.