Begin typing your search above and press return to search.

అమ్మ లేకపోవడం మంచిదని ట్రోల్‌ చేశారు

By:  Tupaki Desk   |   26 Aug 2020 12:40 PM IST
అమ్మ లేకపోవడం మంచిదని ట్రోల్‌ చేశారు
X
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ మొదటి సినిమా ధడక్‌ విడుదలైనప్పటి నుండి కూడా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. నెపొటిజంతో పాటు ఆమె నటన విషయంలో కూడా ట్రోల్స్‌ ఎదుర్కొంటుంది. తాజాగా విడుదలైన గుంజన్‌ సక్సేనా సినిమా విషయంలో ఆమె మరింతగా టార్గెట్‌ అయ్యింది. ఆమెను కొందరు నీకు నటన అవసరమా అంటూ అవహేళన చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమెపై వస్తున్న కామెంట్స్‌ కొన్ని సార్లు శృతి మించుతున్నాయి. తాజాగా తనపై వస్తున్న కామెంట్స్‌ పై జాన్వీ కపూర్‌ స్పందించింది.

ట్రోల్స్‌ నాకు కొత్త ఏమీ కాదు. మొదటి సినిమాలో నటించక ముందు నుండి నన్ను సోషల్‌ మీడియాలో ఏదో ఒక కామెంట్‌ చేస్తూనే ఉన్నారు. నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించను. నాకు పాజిటివ్‌ కామెంట్స్‌ కూడా ఎక్కువగానే వస్తాయి. కనుక నేను వాటి పట్ల స్పందించాలనుకుంటాను అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.

ఒకానొక సందర్బంలో నా నటన గురించి కామెంట్స్‌ చేస్తూ మీ అమ్మ ఇప్పుడు లేకపోవడం మంచిది అయ్యింది అన్నారు. ఆ వ్యాఖ్యలు నాకు చాలా బాధను కలిగించాయి. ట్రోల్స్‌ చేసే వారు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అవతలి వారి మనో భావాల విషయంలో పట్టింపు లేకుండా ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.