Begin typing your search above and press return to search.

టైగ‌ర్..ర‌ణ‌బీర్ పై మ‌న‌సుప‌డ్డ జాన్వీక‌పూర్!

By:  Tupaki Desk   |   26 Nov 2022 11:30 PM GMT
టైగ‌ర్..ర‌ణ‌బీర్ పై మ‌న‌సుప‌డ్డ జాన్వీక‌పూర్!
X
బాలీవుడ్ క్రేజీ స్టార్స్ టైగ‌ర్ ష్రాప్..ర‌ణ‌బీర్ క‌పూర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గాళ్స్ హృదయాన్ని కొల్ల‌గొట్టే స్టార్స్ ఇద్ద‌రు. ఇద్ద‌రికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కోట్లాది మంది అభిమానులు ఇద్ద‌ర్ని ఎంత‌గానో ఆరాదిస్తారు. ఇక సెల‌బ్రిటీ హీరోయిన్లు సైతం వాళ్లిద్ద‌రు ఎంతో ప్ర‌త్యేకం. తాజాగా అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ సైతం ఆ ఇద్ద‌ర్ని అంతే ఆరాదిస్తుంద‌ని తెలుస్తోంది.

తాజాగా జాన్వీ ముందుకు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వెళ్లింది. మీకు స్వ‌యంవ‌రం నిర్వ‌హిస్తే బాలీవుడ్ లో ఏఏ హీరోలు క్యూలో ఉండాల‌ని కోరుకుంటారు అని ప్ర‌శ్నించ‌గా ఠ‌కీమ‌ని ర‌ణ‌బీర్ క‌పూర్..టైగ‌ర్ ష్రాప్ అని తెలిపింది. ర‌ణ‌బీర్ అంటే చాలా ఇష్టం అంది. అలాగే టైగ‌ర్ ష్రాప్ ని సైతం అంతే అభిమానిస్తాన‌ని...అత‌ని క‌ష్టం గురించి చెప్పుకొచ్చింది.

మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ అవ‌స‌రం లేదా? అంటే అత‌నికి పెళ్లి అయిపోయిందిగా అంటూ న‌వ్వేసింది. దీంతో బాలీవుడ్ జ‌నాలు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. మాకు తెలియ‌కుండా విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? అంటూ వైట్ ఫేస్ పెట్టారు. మ‌రి ఈ విష‌యంలో జాన్వీ క‌న్ ప్యూజ్ అయిందా? లేక నిజంగానే పెళ్లి అయిపోయింద‌ని పొర‌బొడుతుందా? అన్న‌ది క్లారిటీ రావాలి.

ఒక‌వేళ తాను అనుకున్న‌ది నిజ‌మే అయితే స్వ‌యం వ‌రం జాబితాలో విజ‌య్ దేవ‌రకొండ పేరు కూడా చెప్పేదేమో. ఈ యంగ్ హీరోని జాన్వీ మూడు ..నాలుగు సార్లు బ‌య‌ట క‌లిసిన‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ఇద్ద‌రు జంట‌గా సినిమా చేస్తున్న‌ట్లు కూడా ఆ మ‌ధ్య ప్ర‌చారం సాగిందిగానీ..అది సాధ్య‌ప‌డ‌లేదు.

కానీ విజ‌య్ మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌స్తే గ‌నుక జాన్వీ క్యూలో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అలాగే ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్యూటీ గురించి స్పందించిన సంగ‌తి తెలిసిందే. అత‌నికి వ‌య‌సు పెరుగుతుందా? త‌రుగుతుందా? అంద అందంగా ఉన్నాడు అంటూ న‌వ్వేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.