Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : జూ. అతిలోక సుందరి హొయలు

By:  Tupaki Desk   |   3 Aug 2021 3:59 AM GMT
పిక్ టాక్‌ : జూ. అతిలోక సుందరి హొయలు
X
సౌత్‌ మరియు నార్త్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ అనడంలో సందేహం లేదు. ఆమె హీరోయిన్ గా ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకటి రెండు అయినా.. అవి పెద్దగా సక్సెస్ ను దక్కించుకోకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఆమెకు ఏకంగా 12 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ స్థాయిలో ఇన్ స్టా ఫాలోవర్స్ ఉండటం చిన్న విషయం ఏమీ కాదు. ఆమె ఇలాంటి హాట్ ఫొటోలను షేర్‌ చేస్తూ ఉండటం వల్లే ఈ స్థాయిలో ఫాలోవర్స్ అనడంలో సందేహం లేదు.

సౌత్‌ లో హీరోయిన్ గా సుదీర్ఘ కాలం చేసిన శ్రీదేవి కూతురు కనుక జాన్వీ కపూర్ కు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతానికి బాలీవుడ్‌ లోనే ఈమె సినిమాలు చేస్తూ ఉన్నా కూడా సౌత్‌ లో అభిమానులకు తక్కువ లేరు. ఆమె ఫొటోల కోసం సౌత్‌ నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. నార్త్‌ సౌత్ లో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉండే ఈమె తాజాగా మరోసారి తన హాట్ ఫొటోలను షేర్‌ చేసింది. డ్రస్సింగ్‌ రూమ్ సెల్ఫీలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తన ఔట్‌ ఫిట్‌ ను చూపించడమే కాకుండా హొయలు ఒలకబోస్తూ ఆకట్టుకునే రూపంలో జాన్వీ కపూర్‌ ఈ ఫొటోల్లో కనిపిస్తుంది. జాన్వీ కపూర్‌ ప్రస్తుతం తమిళంలో నయనతార నటించిన ఒక సినిమాను హిందీలో రీమేక్ చేస్తోంది. ఇది కాకుండా ఇంకా చాలా సినిమాలు కూడా ఆమె ముందు ఉన్నాయి. ఆమద్య ఒక తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఈమె ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.