Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇద్దరు బ్యూటిఫుల్ కపూర్లు

By:  Tupaki Desk   |   18 March 2019 8:27 AM GMT
ఫోటో స్టొరీ: ఇద్దరు బ్యూటిఫుల్ కపూర్లు
X
సాధారణంగానే బాలీవుడ్ బ్యూటీల స్టైల్ తట్టుకోలేం. ఇక ఏదైనా అవార్డు ఫంక్షన్ ఉందంటే చాలు డిజైనర్ వేర్లో ఎంతో అందంగా తయారై వస్తారు. చూపరుల కళ్ళను తిప్పుకోనివ్వరు. రీసెంట్ గా కూడా అలానే జరిగింది. హలో మ్యాగజైన్ వారు అవార్డు ఫంక్షన్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కు ఇద్దరు కపూర్లు హాజరయ్యారు.. ఒకరు సోనం కపూర్ అహూజా.. మరొకరు జాన్వీ కపూర్.

ఊరికే స్టైల్ గా తమ డ్రెస్ చూపించుకోవడానికి హాజరు కాలేదు సోనమ్.. జాన్వి. సోనమ్ కు 'ట్రెయిల్ బ్లేజర్ పెర్ఫామర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేయగా జాన్వికి 'బెస్ట్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్' అనే అవార్డును ఇచ్చారు. ఈ అవార్డులను స్వీకరించడానికి హాజరయ్యారు. అవార్డులు స్వీకరించడమే కాదు ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఒక ఫోటో ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి 'నా డేట్ తో లాస్ట్ నైట్. జాన్వికి బెస్ట్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్.. నాకు ట్రెయిల్ బ్లేజర్ పెర్ఫామర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఇచ్చినందుకు హలో మ్యాగజైన్ ఇండియా వారికి కృతజ్ఞతలు. మనం నమ్మిన దానికి అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోలో ఆకుపచ్చ రంగుతో పాటు పింక్ కలర్ కూడా కలిసిన ఒక స్లీవ్ లెస్ లాంగ్ గౌయిన్ లో దర్శనమిచ్చింది. డీప్ నెక్ తో క్లీవేజ్ షో కూడా చేసేసింది. మరోవైపు జూనియర్ అతిలోక సుందరి జాన్వి బూడిద రంగు థై-స్లిట్ గౌన్ లో తళుక్కున మెరిసింది. ఇద్దరూ అక్క చెల్లెళ్ళు(బోనీ కపూర్ కూతురు.. అనిల్ కపూర్ డాటరు) ఇచ్చిన పోజు నెటిజనులను ఎంతో ఆకర్షిస్తోంది. మూడు గంటలలోనే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.