Begin typing your search above and press return to search.

బీ అలెర్ట్: ఇండ‌స్ర్టీలో జాన్వీ ఇంకా కొన్నాళ్లే!

By:  Tupaki Desk   |   12 Aug 2022 5:12 AM GMT
బీ అలెర్ట్: ఇండ‌స్ర్టీలో జాన్వీ ఇంకా కొన్నాళ్లే!
X
అతిలోక సుంద‌రి శ్రీదేవి వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్ కెరీర్ బాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతుంది. ద‌క్షిణాది ప‌రిశ్ర‌ల‌మ‌పైనా దృష్టి సారిస్తుంది. అమ్మ‌డి సౌత్ ఎంట్రీ ఎప్పుడైనా జ‌రిగే అవకాశం ఉంది. త‌ల్లి త‌ర‌హాలోనే జాన్వీ స‌హా దేశంలో అన్ని భాష‌ల్లో సినిమాలు చేయాల‌న్న‌ది అభిమానుల కోరిక‌. తండ్రి బోనీకపూర్ సైతం శ్రీదేవి అంత‌టి గొప్ప హీరోయిన్ ని చేయాల‌ని క‌ల‌లు కంటున్నారు.

జాన్వీ బాలీవుడ్ కెరీర్ మొద‌లైన నాటి నుంచి ప్ర‌తీ అడుగు వెనుక బోనీ ఉన్నారు. ఆయ‌న సూచ‌న‌లు..స‌ల‌హాలు పాటిస్తూనే? అమ్మ‌డు ముందుకు సాగుతుంది. ఇటీవ‌లే జాన్వీ ఓ బాంబ్ పేల్చిన సంగ‌తి తెలిసిందే. అంతా త‌ల్లి ఇష్ట‌ప్ర‌కారం జాన్వీ సినిమాల్లోకి వ‌చ్చిన‌ట్లు భావిస్తే...త‌ల్లికి ఇష్టం లేకుండా జాన్వీ ఇష్ట‌ప్ర‌కారం సినిమాల్లోకి వ‌చ్చిన‌ట్లు తేలింది.

ఎలాగూ మేక‌ప్ వేసుకుంది కాబ‌ట్టి ఓ న‌ల‌భై ఐదేళ్లు వ‌చ్చే వ‌ర‌కూ అయినా న‌టిగా కొన‌సాగుతుంద‌ని అంతా భావిస్తున్నారు. అంటే స‌రిగ్గా? రెండు దశాబ్ధాల పాటు జాన్వీ ప్ర‌యాణం త‌ప్ప‌క ఆస్వాదించొచ్చు అని అభిమానులు ఆశ‌లు పెట్టుకోవ‌డం స‌హ‌జం. కానీ జాన్వీ ప్ర‌యాణం అంత వ‌ర‌కూ సాగేలా క‌నిపించ‌లేదు. త‌ల్లికి ఇష్టం లేక‌పోయినా? మేక‌ప్ వేసుకుంటోన్న‌ జాన్వీ వీలైనంత వేగంగా కెరీర్ ని ముగించి అతిలోకసుంద‌రికి ఘ‌న‌మైన నివాళి అర్పించాల‌ని భావిస్తోందిట‌.

త‌ల్లి కోరుకున్న‌ట్లుగానే జాన్వీ కుటుంబ జీవితాన్ని కోరుకునే ఓ సాధార‌ణ మ‌హిళ జీవితాన్ని గ‌డిపే ఆలోచ‌న‌లో ఉందిట‌. ఎన్ని భాష‌ల్లో సినిమాలు చేసినా..ఎంత పేరొచ్చినా రంగుల ప్ర‌పంచం నుంచి విలైనంత త్వ‌రంగా నిష్ర్క‌మించాల‌ని కృ నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జాన్వీ ఆర‌కంగా చేసిన‌ప్పుడే త‌న త‌ల్లికి ఘ‌న‌మైన నివాళి అర్పించిన‌ట్లు అవుతుంద‌ని భావిస్తుందిట‌.

సినిమా రంగంలో ఒడిదుడుకు..క‌ష్ట‌న‌ష్టాలు అన్నింటిని ఎదుర్కుని శ్రీదేవి నిలబడింది. తెలిసి తెలిసి ఏ న‌టి కుమార్తెని హీరోయిన్ చేయాల‌నుకోదు. జాన్వీ విష‌యంలో కూడా శ్రీదేవి అలాగే భావించింది. అందుకే కుమార్తెను సినిమాల్లోకి వెళ్లోద్ద‌ని చెప్పి ఉండొచ్చు. కానీ ఇంట్లో అంతా సినిమా వాతావ‌ర‌ణం కావడంతో జాన్వీకి చిన్న వ‌య‌సులోనే సినిమాల‌పై ఆస‌క్తి మొద‌లైంది.

కార‌ణాలు ఏవైనా? జాన్వీతో సినిమాలు చేయాల‌నుకుంటోన్న నిర్మాత‌లు మాత్రం ఇప్ప‌టి నుంచే తొద‌ర‌ప‌డాల్సిందే. అన్ని ప‌రిశ్ర‌ల‌మ‌ల్లోనూ శ్రీదేవికి ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. ఆమెతో సినిమాలు చేయాల‌ని భావించిన నేటి త‌రం నిర్మాత‌లెంతో మంది ఉన్నారు. వాళ్లంతా క‌నీసం జాన్వీతోనైనా సినిమా చేసి త‌మ కొర్కెను నెర వేర్చుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్నారు.

వాళ్లంతా తొంద‌ర‌ప‌డాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ప్ర‌స్తుతం జాన్వీ వ‌య‌సు వ‌య‌సు 25. మ‌రో 12 ఏళ్ల‌ పాటు జాన్వీ సేవ‌లందించే అవ‌కాశం ఉంది. త‌ల్లి కోరిక మేర‌కు త్వ‌ర‌గానే పెళ్లి చేసుకునే అవ‌కాశం కూడా ఉంది. ఇవ‌న్నీ బేరీజు వేసుకునే జాన్వీ మ్యాక‌ప్ వేసుకుంటుంది. ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గానేనే జాన్వీ ప్యాక‌ప్ చెప్పేసే అవ‌కాశం ఉంది.