Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.

By:  Tupaki Desk   |   29 Jun 2023 4:19 AM IST
ఫోటో స్టోరి: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
X
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా..
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా..

ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలి ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
నిను కానలేక మనసూరుకోక పాడా ను నేను పాటనై.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.

మంచి మ‌న‌సులు సినిమా కోసం గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాలు పాడిన పాట ఇది. సాహిత్యం సంగీతం ప‌రంగా సంగీత ప్రియుల‌ హృద‌యాల్లో నిలిచిపోయిన ఈ గీతం ఇప్ప‌టి సంద‌ర్భానికి స‌రిపోతుంది మ‌రి. యువనాయిక జాన్వీ అర‌విరిసిన ఆ అంద‌మైన‌ న‌వ్వులు చూశాక ఎవ‌రికైనా ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సాహిత్యం గుర్తుకు వ‌స్తుంది.

ఆ న‌వ్వుల్లోనే నిగ్గులు తేల్తున్నాయ్. ఆ బుగ్గ‌లు ఎర్ర‌గా కందుతున్నాయ్. అలా ఒత్తుగా ఎదిగిన గ‌డ్డి పోచ‌ల్లో నీ అంద‌మైన‌ న‌వ్వు డిజైన‌ర్ ఫ్రాకులో ఆ నును సిగ్గుల సింగారం చూసి చూసి కుర్ర‌కారు గుండెలు అవిసిపోతున్నాయ్‌. తొంద‌ర్లోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ తో తెలుగు లోగిళ్ల‌లో అడుగు పెడుతున్న జాన్వీ పై చాలా అంచ‌నాలే ఉన్నాయి. త‌న మాతృమూర్తి అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ని మ‌రిపిస్తుంద‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌ల్ని ఏలిన ఒక మేటి లెజెండ‌రీ న‌టీమ‌ణి కుమార్తె రాక కోసం వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు ప్ర‌స్తుతానికి..