Begin typing your search above and press return to search.

వీడియో : జాన్వీ కపూర్‌ చెన్నై హోం టూర్‌

By:  Tupaki Desk   |   17 Nov 2022 10:30 AM GMT
వీడియో : జాన్వీ కపూర్‌ చెన్నై హోం టూర్‌
X
హీరోయిన్‌ గా తెలుగు.. తమిళంతో పాటు బాలీవుడ్‌ లో కూడా వెలుగు వెలిగిన అతిలోక సుందరి శ్రీదేవి లేని లోటును ఆమె కూతురు జాన్వీ కపూర్‌ తీర్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ సాధ్యం అయినంత వరకు ఎక్కువగా సినిమాలు చేసేందుకు కమిట్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఒక భారీ హిట్ అనేది ఈమెకు దక్కలేదు. అయినా కూడా ప్రయత్నాలు కంటిన్యూ చేస్తోంది.

సినిమాలతో దక్కని గుర్తింపును సోషల్‌ మీడియా ద్వారా దక్కించుకుంది. ఇప్పటికే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతు ఉన్నారు. ఈమె యొక్క సోషల్‌ మీడియా అకౌంట్‌ ను ఫాలో అవ్వడంతో పాటు.. ఈమె ఫోటోలు ఎక్కడ వచ్చినా కూడా అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

తాజాగా మరోసారి జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో సందడి చేసింది. ఈ సారి జాన్వీ కపూర్‌ యూట్యూబ్‌ లో తన చెన్నై లోని ఇంటిని చూపించి వార్తల్లో నిలిచింది. తన తల్లితో పాటు తండ్రి తో అక్కడ కలిసి ఉన్నాను అంటూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంది.

చెన్నై లోని అద్భుతమైన ఇంటిని జాన్వీ కపూర్‌ ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌ కోసం చూపించింది. వోగ్‌ యూట్యూబ్‌ ఛానల్ లో ఈ వీడియోను పోస్ట్‌ చేయడం జరిగింది. శ్రీదేవి ఉన్నటి నుండి ఇప్పటి వరకు ఆ ఇంటిని జాన్వీ కపూర్‌ మరియు బోనీ కపూర్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారట.

జాన్వీ చూపించిన శ్రీదేవి ఇల్లు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. తక్కువ సమయంలోనే మిలియన్ వ్యూస్ కు ఈ వీడియో చేరువ అయ్యింది. వేలల్లో లైక్స్ మరియు షేర్‌ ను కూడా ఈ వీడియో దక్కించుకుంటుంది. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే మిలీ అనే సినిమా తో వచ్చింది. త్వరలోనే మరో కొత్త సినిమాను ఈమె విడుదల చేయబోతుందట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.