Begin typing your search above and press return to search.

#జ‌న‌తా క‌ర్ఫ్యూ: టాలీవుడ్ సెల‌బ్రిటీల క్లాప్స్

By:  Tupaki Desk   |   22 March 2020 6:09 PM GMT
#జ‌న‌తా క‌ర్ఫ్యూ: టాలీవుడ్ సెల‌బ్రిటీల క్లాప్స్
X
దేశంలో అత్యవ‌స‌ర ప‌రిస్థితి పెను ముప్పు గురించి తెలిసిందే. చైనా నుంచి ఇండియాలో దిగిన క‌రోనా భూతం మ‌హ‌మ్మారీలా విజృంభిస్తోంది. చైనీయులు దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగినా భారత దేశంలో స‌న్నివేశం అదుపు త‌ప్పుతోంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే క‌రోనాపై ప్ర‌ధాని మోదీ జ‌న‌తా క‌ర్ఫ్యూ పేరుతో యుద్ధ‌మే ప్ర‌క‌టించారు. ఇక క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ రేయింబ‌వ‌ళ్లు వైద్యులు- పోలీసులు- జ‌వాన్లు చేస్తున్న సేవ‌ల్ని గుర్తించి వారికి సంఘీభావంగా ఆదివారం సాయంత్రం దేశ ప్రజలంతా తమ ఇళ్లలో నుంచే చప్పట్లు.. గంటలు కొట్టారు.

తెలుగు సినీ సెల‌బ్రిటీ ప్ర‌పంచం చ‌ప్ప‌ట్ల కార్య‌క్ర‌మానికి ఊపు తెచ్చింది. చాలా మంది హీరోలు ఇళ్ల లో నుంచే చ‌ప్ప‌ట్లు కొడుతున్న వీడియోల్ని ... గంట‌లు మోగిస్తున్న ఫోటోలు- వీడియోల్ని సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొట్ట‌డం అభిమానుల్లో స్ఫూర్తి నింపింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇంటి బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్ట‌డం ఆక‌ట్టుకుంది. ప్రతి ఒక్కరీ బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టడంపై చ‌ర‌ణ్ ఆనందం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ఇంట్లో గంటను మోగించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టిన వైనం... యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వార‌సుడు అభ‌య్ రామ్ ఇంట్లో గంట‌లు మోగించడం స్ఫూర్తి నింపింది.

మంచు మోహ‌న్ బాబు కుటుంబ స‌మేతంగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. మనోజ్ బాల్కనీలో నుంచి చప్పట్లు కొట్టారు. అత‌డు వందేమాతరం అంటూ నినదించారు. ద‌ర్శ‌కుడు పూరి - ఛార్మి బృందం తమ ఆఫీసు ఆవరణలో నిలబడి చప్పట్లు కొట్టారు. పూరీ జగన్నాథ్ తన స్టైల్లో `నీ అయ్య కరోనా` అంటూ త‌న‌దైన శైలిలో సంద‌డి చేశారు. నాగ‌బాబు- వరుణ్ తేజ్ ఫ్యామిలీ నిహారికతో కలిసి చప్పట్లు కొట్లారు.

క‌థానాయిక‌ల్లో పూజా హెగ్డే ముంబై లోని తన ఇంటి బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టారు. ఆమె తండ్రి శంఖం ఊదారు. టాలీవుడ్ లో టీవీ ఆర్టిస్టులు చ‌ప్ప‌ట్లు కార్య‌క్ర‌మంలో పాల్గొని స్ఫూర్తి నింపారు. నిఖిల్ సిద్ధార్థ- గోపీచంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు.