Begin typing your search above and press return to search.

వినాయక గ్యారేజ్.. అన్ని కోరికలు తీర్చబడును

By:  Tupaki Desk   |   5 Sept 2016 5:00 PM IST
వినాయక గ్యారేజ్.. అన్ని కోరికలు తీర్చబడును
X
ఇవాళ వినాయక చవితి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ప్రతీ ఏటా వచ్చే ఈ పండుగ కోసం ఏడాది మొత్తం ఎదురుచూసే వాళ్లు ఉంటారు కూడా. అలాగే చవితి పందిళ్లలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రతీ సందులోనూ పందిరి ఉన్నా.. ఏ గణేషుడికే ఆ గణేషుడే డిఫరెంట్ గా దర్శనమిస్తుంటాడు.

గణేషుడిని తమ ఫ్రెండ్ గానో.. కుటుంబ సభ్యుడిగానో భావించేసే మన జనాలు.. రకరకాల క్రేజీ అవతారాల్లో వినాయకుడిని తయారు చేస్తుంటారు. గతేడాది బాహుబలి గణేషుడు ప్ర్యత్యేక ఆకర్షణ కాగా.. ఈ సారి 'వినాయక గ్యారేజ్' ఆకట్టుకుంటోంది. జనతా గ్యారేజ్.. ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అనే టైటిల్- ట్యాగ్ లైన్ నుంచి.. 'వినాయక గ్యారేజ్.. ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును' అంటూ రూపొందిన ఓ పోస్టర్ స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది.

చవితి ఇవాళే కాబట్టి.. విచిత్రంగా అనిపించినా ఆకట్టుకున్న మొదటి వినాయక పందిరి ఇదే. మొత్తం నవరాత్రులు పూర్తయ్యేపాటికి ఇలాంటివి చాలానే దర్శనమివ్వచ్చు. ఇలాంటి అప్ డేట్స్ అందించేందుకు తుపాకి.కాం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెబుతూ.. రీడర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతోంది తుపాకి.కామ్.