Begin typing your search above and press return to search.

జనతా సంబరాలు వైజాగ్ లో ఖాయం

By:  Tupaki Desk   |   6 Sept 2016 6:36 PM IST
జనతా సంబరాలు వైజాగ్ లో ఖాయం
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ సృష్టిస్తున్న సంచలనాలు ఇప్పుడప్పుడే కంప్లీట్ అయ్యేవి కావనే విషయం కనిపిస్తూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఐదు రోజులు వరుసగా కుమ్మేసుకునే అరుదైన ఛాన్స్ ని పక్కగా ఉపయోగించుకుంది జనతా గ్యారేజ్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించడంతో.. ఇండస్ట్రీ టాప్-5లోకి ఈ సినిమా ఎంటర్ కావడం పెద్ద కష్టం కాదనే విషయం అర్ధమైపోతోంది.

ఇంత పెద్ద సక్సెస్ ను అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తోంది యూనిట్. విశాఖ పట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టగా.. ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేేసేశారు. ఈ శనివారం అంటే సెప్టెంబర్ 10వ తేదీనే జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్ గ్రాండ్ లెవెల్ లో జరగనుండగా.. దీనికి సినిమా యూనిట్ మొత్తం హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టాక్ కు.. రివ్యూలకు అతీతంగా విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పనున్నాడు ఎన్టీఆర్.

వాస్తవానికి జనతా గ్యారేజ్ మూవీలో కాసిన్ని లోటుపాట్లున్నా... కేస్టింగ్ తో పాటు సినిమాలో ఉన్న భారీతనం.. ఎన్టీఆర్ యాక్టింగ్.. కొరటాల టేకింగ్.. ఆ లోపాలను ఓవర్ కమ్ చేసేశాయి. చాలా నెలల తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు బారులు తీరేలా చేసిన సినిమా జనతా గ్యారేజ్ అనడంలో సందేహాలు అక్కర్లేదు.