Begin typing your search above and press return to search.

జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ ఇదే

By:  Tupaki Desk   |   16 Jan 2016 6:59 AM GMT
జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ ఇదే
X
సుకుమార్ తో చేసిన నాన్నకు ప్రేమతో సూపర్ సక్సెస్ కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు. ఇదే స్పీడ్ తో నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేస్తున్నాడు కూడా. సాధారణంగా సినిమాలను మొదలుపెట్టడంలో ఎన్టీఆర్ కొంచెం స్లోగానే ఉంటాడు. కానీ ఎన్టీఆర్ ఈ సారి మాత్రం.. నాన్నకు ప్రేమతో సెట్స్ పై ఉండగానే, జనతా గ్యారేజ్ కి కొబ్బరికాయ కొట్టేశాడు.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం .. ఫిబ్రవరి 10 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం మరో వారం తర్వాత యూనిట్ కు జత అవుతాడు. సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటించనున్న జనతా గ్యారేజ్ లో.. మళయాళ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక ప్రధాన పాత్ర పోషించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. క్రిష్ 3 వంటి భారీ ప్రాజెక్టులకు పని చేసిన తిరు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. జనతా గ్యారేజ్ కి సంబంధించిన సన్నివేశాల కోసం సారిధి స్టూడియోస్ లో భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సెట్స్ లో మూవీ షూటింగ్ ప్రారంభం అవడంతో పాటు.. 45 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేయనున్నారు.

ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ లు సహా ప్రధాన నటీనటులంతా పాల్గొంటారు. కొరటాల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ కావడంతో.. ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. ఆగస్ట్ 12న జనతా గ్యారేజ్ ని రిలీజ్ చేసేలా.. పక్కాగా షూటింగ్ ప్లాన్ చేశారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.