Begin typing your search above and press return to search.

గ్యారేజ్ కి డోర్లు.. తాళం వేసేశారట

By:  Tupaki Desk   |   23 Aug 2016 10:26 AM IST
గ్యారేజ్ కి డోర్లు.. తాళం వేసేశారట
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. రీసెంట్ గా ఆడియో ఫంక్షన్ జరుపుకుని.. త్వరలో విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి.. షూటింగ్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ అనౌన్స్ చేశాడు.

ఇప్పటికే ఓసారి జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా వేయడంతో.. అభిమానుల్లో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఈసారైనా చెప్పిన టైమ్ కి వచ్చేయాలని మొక్కేసుకుంటున్నారు కూడా. వీరందరి కోరికలను తీర్చేస్తూ.. 'షూటింగ్ ముగిసిపోయింది. నా బెస్ట్ అనుభవాల్లో ఇది ఒకటి. కొరటాల శివకు థ్యాంక్స్' అంటూ ట్వీట్ పెట్టి మరీ.. ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇంతకీ ఎన్టీవోడు చివరగా ఓ ఐటెం నెంబర్ కి డ్యాన్స్ చేసేశాడు లెండి. కాజల్ అగర్వాల్ ఈ పాటలో ఐటెం గాళ్ గా కనిపించేస్తోంది.

సమంత.. నిత్యామీనన్ లు హీరోయిన్ లుగా నటించిన జనతా గ్యారేజ్ కి.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా.. తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఏకకాలంలో రిలీజ్ అవుతోంది. ఇప్పుడు గ్యారేజ్ కి డోర్లేసి తాళాలు పెట్టేయడంతో.. సెప్టెంబర్ 2 రిలీజ్ కి సిద్ధమైపోయినట్లే.