Begin typing your search above and press return to search.

గ్యారేజ్ కొత్త డేట్ కి.. సెంటిమెంట్ దెబ్బ!!

By:  Tupaki Desk   |   16 July 2016 5:47 AM GMT
గ్యారేజ్ కొత్త డేట్ కి.. సెంటిమెంట్ దెబ్బ!!
X
టాలీవుడ్ లో సెంటిమెంట్స్ భలే విచిత్రంగా ఉంటాయి. సినిమా హిట్ కోసం ఎన్నింటిని లెక్కెడతారో.. బ్యాడ్ కోసం అన్నే సెంటిమెంట్లను బయటకు తీస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్ లో వస్తున్న జనతా గ్యారేజ్ కోసం కూడా ఓ బ్యాడ్ సెంటిమెంట్ వచ్చిపడింది. అయితే ఇది పాతది కాదు.. ఈ ఏడాదే కనిపెట్టిన న్యూ సెంటిమెంట్.

జనతా గ్యారేజ్ ను ఆగస్ట్ 12 నుంచి సెప్టెంబర్ 2కు వాయిదా వేశారు. అభిమానులకు ఇదే ఇప్పుడు బాధపెడుతోంది. రిలీజ్ వాయిదా పడ్డం కంటే కొత్త డేట్ విషయంలోనే ఎక్కువగా ఫీలయిపోతున్నారు. సెప్టెంబర్ 2 అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఇలా ఇతర హీరోల పుట్టిన రోజున విడుదల స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాది ఏదీ అచ్చి రాలేదు. మొదటగా ఏప్రిల్ 8న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. అల్లు అర్జున్ పుట్టిన రోజునాడు విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

ఆ తర్వాత మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం మే 20న విడుదలైంది. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. దీని రిజల్ట్ కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు పవన్ బర్త్ డే నాడు యంగ్ టైగర్ సినిమాను ప్లాన్ చేయడం ఫ్యాన్స్ ను భయపడేలా చేస్తోంది. సినిమా హిట్ అయితే ఇలాంటి సెంటిమెంట్స్ కనిపించవు కానీ.. తేడా వస్తే మాత్రం కొత్త సెంటిమెంట్ ఫిక్స్ అయిపోనట్లే.