Begin typing your search above and press return to search.
అర్ధ శతదినోత్సవానికే ఇళ్ళలో జనతా గ్యారేజ్
By: Tupaki Desk | 30 Sept 2016 10:07 AM ISTఈ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు.. టాలీవుడ్ ఫిలిం హిస్టరీలోనే టాప్3లో నిలిచింది జనతా గ్యారేజ్. సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ.. ప్రస్తుతం ఐదోవారంలో ఉంది. ఇంకా చెప్పుకోదగినన్ని థియేటర్లలో ఉండడం.. షేర్ కూడా సంతృప్తికరంగానే ఉండడంతో.. ఈ థియేటర్లలో లాంగ్ రన్ ఖాయమే అనుకున్నారంతా. కానీ ఆ లాంగ్ రన్ రికార్డులు కష్టమయ్యేలా ఉన్నాయి.
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ను.. టీవీలో ప్రదర్శించేందుకు మాటీవీ రెడీ అయిపోతోందని తెలుస్తోంది. అక్టోబర్ 23న గ్యారేజ్ ను టెలికాస్ట్ చేయనున్నారట. అప్పటికి ఈ మూవీ రిలీజ్ అయ్యి కేవలం 53వ రోజే. సాధారణంగా 100 రోజుల తర్వాత కానీ సినిమాని ఛానల్స్ లో ప్రదర్శించరు. కానీ జనతా గ్యారేజ్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ కారణంగా... 10.50 కోట్లు వెచ్చించి రైట్స్ కొనుక్కుంది ఈ ఛానల్.
మరి ఆ మొత్తాన్ని సేఫ్ గా రికవర్ చేసుకోవాలంటే.. వీలైనంత త్వరగా ప్రదర్శించడమే నయం అని భావిస్తున్నారట. ఓ రకంగా చూస్తే.. రిలీజ్ అయిన 50 రోజులకే.. ఇంకా థియేటర్లలో ఉండగానే.. టీవీల్లో టెలికాస్ట్ అయిన భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ మూవీగా జనతా గ్యారేజ్ కొత్త రికార్డ్ సృష్టించేట్లుగానే ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/