Begin typing your search above and press return to search.

గ్యారేజ్ లో పాటలతో టైగర్ రచ్చ

By:  Tupaki Desk   |   12 Aug 2016 4:40 PM IST
గ్యారేజ్ లో పాటలతో టైగర్ రచ్చ
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ మూవీ చూసి కొన్నేళ్లు గడిచిపోయింది. టెంపర్ - నాన్నకు ప్రేమతో చిత్రాలతో ఈ మధ్య హిట్ ట్రాక్ లోకి వచ్చినా.. అవి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్. సినిమా మొత్తాన్ని ఎన్టీఆర్ నడిపించినా.. హీరోని నడిపించే బలమైన ఎలిమెంట్స్ వెనకాల ఉంటాయి. కానీ హీరో వెనక కథలు నడిచేలా స్టోరీ - స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దిట్ట అయిన కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్.. ఇవాళ ఆడియో ఫంక్షన్ చేసుకోబోతోంది.

హైద్రాబాద్ లో గ్రాండ్ లెవెల్ లో జరగనున్న ఈవెంట్ లో అభిమానులను థ్రిల్ చేసే కొత్త సంగుతులు చాలా చెప్పబోతున్నారట. జనతా గ్యారేజ్ లో ఆకట్టుకునే పలు అంశాల గురించి డీటైల్డ్ గా చెప్పనున్నాడట దర్శకుడు కొరటాల. అసలీ సినిమాకి ఆడియోనే బిగ్గెస్ట్ అట్రాక్షన్ అవుతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అన్ని పాటలను అదిరపోయే రేంజ్ లో ఇచ్చాడట సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. జనతాగ్యారేజ్ కోసం యంగ్ టైగర్ కు ఇచ్చిన మ్యూజిక్ రచ్చరచ్చ చేయడం ఖాయం అంటున్నారు ఆడియన్స్.

జనతా గ్యారేజ్ లో 6 పాటలు ఉ ఉండగా.. అన్నిటినీ క్రేజీ క్రేజీ సింగర్స్ తోనే పాడించారు. శంకర్ మహదేవన్ - రఘు దీక్షిత్ - యాజిన్ నజీర్ - నేహ భాసిన్.. సుఖ్వీందర్ సింగ్ పాడిన టైటల్ సాంగ్.. శ్వేతా మోహన్ - గీతా మాధురి - సాగర్.. ఇలా హేమాహేమీలతో పాడించారని ట్రాక్ లిస్ట్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సాయంత్రం దేవిశ్రీ చేసే రచ్చరచ్చకి రెడీ అయిపోవచ్చు.