Begin typing your search above and press return to search.
వర్మ పట్టుదలకు జామురాతిరి జాబిలమ్మ నిదర్శణం
By: Tupaki Desk | 1 Sept 2021 6:00 AM ISTఇండియన్ సినీ చరిత్రలో రామ్ గోపాల్ వర్మది ప్రత్యేక స్థానం అనడంలో సందేహం లేదు. ఇప్పుడంటే ఏవో పిచ్చి సినిమాలు తీసి విమర్శల పాలవుతున్నాడు కాని కొన్ని వందల మంది ఫిల్మ్ మేకర్స్ కు ఆదర్శప్రాయుడు వర్మ అనడంలో సందేహం లేదు. శివ సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ ఆ తర్వాత తక్కువ సమయంలోనే దేశంలోనే టాప్ దర్శకుల జాబితాలో నిలిచాడు. సినిమాను ఇలా కూడా తీయవచ్చా.. హాలీవుడ్ సినిమాలను ఇలా కూడా కాపీ కొట్టవచ్చా అన్నట్లుగా ఆయన సినిమాలు ఉండేవి. ప్రతి ఒక్క సినిమా దేనికి అదే విభిన్నమైన సినిమాగా నిలుస్తుంది. ఆయన ఫిల్మ్ మేకింగ్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయనతో సుదీర్ఘ కాలం ట్రావెల్ చేసిన ప్రముఖ ఫిల్మ్ మేకర్.. వర్మను అసిస్టెంట్ డైరెక్టర్ గా దగ్గర నుండి చూసిన శివ నాగేశ్వరరావు ఈమద్య కాలంలో వరుసగా వర్మ సినిమాల గురించి.. ప్రత్యేకమైన విషయాల గురించి వెళ్లడిస్తూ వస్తున్నాడు.
తాజాగా శివ నాగేశ్వరరావు క్షణం క్షణం సినిమాలోని జామురాతిరి జాబిలమ్మ పాట గురించి చెప్పుకొచ్చాడు. కీరవాణి తో వర్క్ చేయాలని శివ సినిమా సమయంలోనే అనుకున్నాడు. అందుకే క్షణం క్షణం నిర్మాతలు ఇళయరాజాను అనుకున్నా కూడా కీరవాణి కావాలని పట్టుబట్టాడట. వర్మ టైమ్ నడుస్తున్న కారణంగా సరే అన్నాడట. ఒక రోజు మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా కీరవాణి గారు మరియు 11 ఏళ్ల అమ్మాయి వచ్చారు. కీరవాణి గారు కీ బోర్డ్ పై హమ్ చేస్తూ పాట ను ట్యూన్ ను ఆలపిస్తున్నారు. ఆయన పక్కన ఉన్న పాప కూడా ట్యూన్ ను హమ్ చేస్తూ ఉంది. వారు చేస్తున్న హమ్మింగ్ ను రామ్ కూడా హమ్ చేశారు. ఆ వెంటనే ఓకే అనేశాడు.
వర్మకు మరో రెండు ట్యూన్స్ ఉన్నాయి వినండి అంటూ కీరవాణి చెప్పే ప్రయత్నం చేసినా కూడా అక్కర్లేదు. చెబుతున్నా కదా నాకు ఇదే నచ్చేసింది. మీరు మరో వంద ట్యూన్స్ వినిపించినా కూడా నచ్చవు అనేశాడు. ఆ వెంటనే సీతారామశాస్త్రి గారితో పాటను రాయించారు. పాట చిత్ర పాడగా బాలు గారు చివరి రెండు లైన్స్ పాడారు. మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్న అమ్మాయి కూడా పాట పాడింది. ఆ అమ్మాయే ప్రస్తుతం సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. పాట చిత్రీకరణ మొదలు పెట్టారు. పూర్తిగా అడవిలో సెలయేరు లో పాట చిత్రీకరణ చేయాల్సి ఉంది. అయితే రియల్ లొకేషన్ లో చాలా ప్రమాదంతో కూడుకున్నది. రాత్రి సమయంలో రియల్ లొకేషన్ లో కష్టం కనుక బొంబయి నుండి ఆర్ట్ డైరెక్టర్ ను రప్పించి అన్నపూర్ణ స్టూడియోలో అడవి సెట్ వేయించాడు. వారం రోజుల పాటు సెట్ ను వేయించారు. పచ్చని చెట్లను అడవి నుండి తీసుకు వచ్చారు.
రోజు రోజు ఆ చెట్లు వాడిపోతూ ఉంటే మళ్లీ తీసుకు వచ్చేవారు. సెట్ అద్బుతంగా రావడంతో పాటు సెలయేరును రియల్ నేచర్ ను తలపించేలా ఎస్ గోపాల్ రెడ్డి గారు అద్బుతంగా చిత్రీకరించారు. రామ్ గోపాల్ వర్మ ప్రతి ఒక్క విషయంలో పట్టుదలతో ఆ పాటను చేయించారు. పూర్తిగా తానే నిర్ణయాలు తీసుకుంటూ జామురాతిరి జాబిలమ్మ పాటను చేయడం జరిగింది. ఆయన పట్టుదల వల్లే ఆ పాట ఇప్పటికి జనాల్లో మంచి ఆధరణ కలిగి ఉంది. ఇంకా వర్మ కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు పాటలు సన్నివేశాలు ఉన్నాయి. ప్రతి దాని నుండి ఎంతో నేర్చుకోవచ్చు.