Begin typing your search above and press return to search.

శాత‌క‌ర్ణిని ఆకాశానికి ఎత్తేసిన స‌త్య‌భామ‌

By:  Tupaki Desk   |   17 Jan 2017 12:24 PM GMT
శాత‌క‌ర్ణిని ఆకాశానికి ఎత్తేసిన స‌త్య‌భామ‌
X
పాత‌త‌రం నటీమ‌ణులు ఎవ‌రైనా కాస్త మొహ‌మాటం లేకుండా మాట్లాడేస్తారు. అలా అని కోరి వివాదాల్లోకి చిక్కుకుంటార‌ని కాదు కానీ.. ఇప్ప‌టి త‌రం వారితో పోలిస్తే కాస్తంత బోల్డ్ గా మాట్లాడ‌తార‌ని చెప్పాలి. అప్ప‌ట్లో ఎన్టీవోడితో జ‌త క‌ట్టి.. స‌త్య‌భామ‌గా అల‌రించిన జ‌మున గుర్తుందా? ఆమె.. బాహుబ‌లి మూవీ మీద చేసిన వ్యాఖ్య అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.

తెలుగు సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్లింద‌ని చెప్పుకునే బాహుబ‌లిని ఆమె సింఫుల్ గా స్టుపిడ్ ఫిలిం అని తీసేశారు. ఆమె అంత సూటిగా.. అలాంటి వ్యాఖ్య చేయ‌టంతో చాలామంది కంగుతిన్నారు. అలాంటి జ‌మున తాజాగా బాల‌కృష్ణ వందో సినిమా అయిన గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణిని చూశారు. స్పెష‌ల్ షోను వీక్షించిన ఆమె.. శాత‌క‌ర్ణిని ఆకాశానికి ఎత్తేశారు. నిర్మాణ విలువ‌ల ద‌గ్గ‌ర నుంచి సెట్స్‌.. వ‌స్త్రధార‌ణ.. ద‌ర్శ‌క‌త్వంతో స‌హా అన్ని చాలా బాగా కుదిరాయ‌ని పొగిడేశారు

సినిమా చూసిన అనంత‌రం పొగిడేసిన జ‌మున‌మ్మ‌.. అదేప‌నిగా సినిమా గురించి చెబుతున్న వేళ‌.. ఆమె ప‌క్క‌నే ఉన్న బాల‌య్య ఆమె మాట్లాడుతుండ‌టం ఓపిగ్గా నిల‌బ‌డే ఉండ‌టం విశేషం. ఇదంతా ఒక ఎత్తుఅయితే.. శాత‌క‌ర్ణి సినిమాను పొగిడేసిన జ‌మున‌.. చివ‌ర‌గా బాల‌య్య నుదిటి మీద ప్రేమ‌పూర్వ‌క ముద్దివ్వ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/