Begin typing your search above and press return to search.

ఈ అవతార్స్ హిట్టయితే.. అవి వస్తాయ్

By:  Tupaki Desk   |   30 Nov 2017 2:30 AM GMT
ఈ అవతార్స్ హిట్టయితే.. అవి వస్తాయ్
X
జేమ్స్‌ కెమెరూన్‌.. సినిమాల గురించి తెలిసిన వారికి ఈ పెరు తప్పకుండా తెలిసే ఉంటుంది. సినీమాలో కొన్ని జీవితాల్ని చూపించాలంటే ఎంతో కష్టం. అయితే ఒక ప్రపంచాన్నే వెండితెరపై చూపించాలంటే అది సాధారణమైన విషయం కాదు. హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ జేమ్స్‌ కెమెరూన్‌ సినిమాల తర్వాత ఏదైనా.. టైటానిక్ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించి ఆ తరువాత అవతార్ సినిమాను తెరకెక్కించాడు.

అయితే అవతార్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాండోరా అనే కొత్త గ్రహంలోకి తీసుకెళ్లి ఆ ప్రపంచాన్ని కళ్లముందు చూపించేశాడు. అయితే ఆ సినిమా అందించిన విజయం వలన మళ్లీ దర్శకుడు అవతార్ సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అవతార్ 2 అండ్ 3 పార్ట్స్ ని ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. సినిమా కోసం కొత్త కొత్త టెక్నాలజీ ని వాడుతున్నారు. అంతే కాకుండా ఏకంగా సరికొత్త టెక్నాలజీ ని కూడా సినిమా కోసం క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణం దశలో ఉంది. ఇక 4 - 5 పార్ట్స్ కూడా ఉండనున్నట్లు దర్శకుడు ముందే చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చివరి 2 పార్ట్స్ పై జేమ్స్ ఎవరు ఊహించని విధంగా కొన్ని విషయాలను తెలిపాడు. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ విడుదల అయిన తర్వాత వాటి రిజల్ట్ ని బట్టి వాటి నెక్స్ట్ పార్ట్స్ ఉంటాయని తెలిపాడు. అంతే కాకుండా సెట్స్ పైకి వెళ్లే వరకు ఆ సినిమాల గురించి చెప్పలేను అన్నాడు. ఇక అవతార్ 2 డిసెంబర్‌ 18 2020 అని గత కొంత కాలమే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అలాగే అవతార్ 3 డిసెంబర్‌ 17, 2021న రానుంది. ఇక ఆ సినిమాలు అనుకున్నంత స్థాయిలో విజయం సాధిస్తే అవతార్‌ 4 - అవతార్‌ 5 చిత్రాలు డిసెంబర్‌ 20, 2024 - డిసెంబర్‌ 19, 2025లో వస్తాయని జేమ్స్ కెమెరూన్ ముందే చెప్పేశాడు.