Begin typing your search above and press return to search.

ఒక్క యాక్షన్ సీన్‌ కి 240 కోట్లా?

By:  Tupaki Desk   |   30 Sep 2015 7:30 AM GMT
ఒక్క యాక్షన్ సీన్‌ కి 240 కోట్లా?
X
మన సినిమాల్లో ఒక యాక్షన్ సీనుకో, ఓ పాటకో కోటి రూపాయలు ఖర్చు పెడితేనే వామ్మో వాయ్యో అని షాకైపోతుంటాం మనం. కానీ ఇక్కడ చూడండి.. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.240 కోట్లు ఖర్చు చేసేస్తున్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇది కనీ వినీ ఎరుగని విశేషమే. ఇంతకీ ఆ స్థాయిలో ఖర్చు పెట్టి సినిమా ఏదీ అంటే.. జేమ్స్ బాండ్ సిరీస్‌ లో వస్తున్న కొత్త మూవీ ‘స్పెక్టర్’.

డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్‌ గా నటిస్తున్న నాలుగో సినిమా, మొత్తంగా జేమ్స్ బాండ్ సిరీస్‌ లో వస్తున్న 24వ సినిమా ‘స్పెక్టర్’. శామ్ మెండెస్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. దీని కోసం ఈ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ని కోసం రూ.240 కోట్లు ఖర్చయిందట. ఈ సన్నివేశంలో భాగంగా ఖరీదైన 7 ఆస్టన్ కార్లను ధ్వంసం చేశారట.

ఇప్పటిదాకా ప్రపంచ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీగా ఈ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు చెబుతున్నారు. అసలు జేమ్స్ బాండ్ సినిమాలంటేనే యాక్షన్ ప్రియులకు పండగలా ఉంటాయి. గత జేమ్స్ బాండ్ మూవీ స్కై ఫాల్ జనాల్ని పెద్దగా ఆకట్టుకోని నేపథ్యంలో ‘స్పెక్టర్’పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.