Begin typing your search above and press return to search.

బాహుబలిని ఢీ కొట్టనున్న జేమ్స్ బాండ్

By:  Tupaki Desk   |   30 Jun 2015 5:00 AM GMT
బాహుబలిని ఢీ కొట్టనున్న జేమ్స్ బాండ్
X
బాహుబలి దెబ్బకు దేశంలోని పెద్ద పెద్ద సినిమాలే బయటకు రాలేక తలుపులు మూసేసుకుంటున్నాయి. బస్తీ లాంటి చిన్నా చితకా సినిమాలు వారంతో సరిపెట్టుకుందామని జూలై 3న థియేటర్లకు పరుగు తీయడానికి సిద్ధంగా వున్నాయి. ఇక గుణశేఖర్ అయితే రుద్రమదేవికి మేకప్ చేస్తూనే వున్నారు. ఇంతమందిని కాదని బాహుబలిని ఢీ కొడతానంటున్నాడు జేమ్స్ బాండ్ అలియాస్ అల్లరి నరేష్.

అల్లరి నరేష్ 49వ సినిమాగా తెరకెక్కిన జేమ్స్ బాండ్ సినిమా మొన్న 26నే రావాల్సింది. కొడితే ఏనుగు కుంబస్థలాన్నే కొట్టాలలనుకున్నాడో ఏమో.. టైగర్, జాదూగాడు లాంటి సినిమాలకి దారోదిలేసి, బాహుబలి విడుదలయిన వారానికి అంటే జూలై 17న జేమ్స్ బాండ్ రూపంలో వస్తున్నాడు. బాహుబలి సినిమా విడుదలయిన 20 నుండి 30 రోజుల వరకూ థియేటర్ల వద్ద జాతరే అని సినీ పండితులు గగ్గోలు పెడుతుంటే అల్లరోడు ఈ సాహసానికి ఎలా పూనుకున్నాడో మరి...! బాహుబలి కత్తుల మధ్య కాసేపు కిసుక్కుమని నవ్విద్దాం అనుకుంటున్నాడు కాబోలు. అన్నట్టు మనోడి 50 సినిమా కూడా ఆగస్ట్ లో ప్రారంభం కానుంది.