Begin typing your search above and press return to search.

జంబ లకిడి పంబ.. పోస్టర్లోనే ఉందిగా

By:  Tupaki Desk   |   14 April 2018 6:48 AM GMT
జంబ లకిడి పంబ.. పోస్టర్లోనే ఉందిగా
X
జంబ లకిడి పంబ.. ఈ పేరు వినగానే నవ్వు వచ్చేసేంతటి కామెడీ పంచిన సినిమా అది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. కామెడీ చిత్రాలలో ఓ ట్రెండ్ సెట్టర్. అలాంటి టైటిల్ ను పెట్టుకుని సినిమా తీయడం నిజంగా సాహసమే అవుతుంది. ఏ కొంచెం తేడా వచ్చినా మొత్తం మూవీ ఫలితంపైనే ప్రభావం చూపుతుంది.

కామెడీ నటుడి పాత్రలతో పాటు అడపా దడపా హీరోగాను మెరుస్తున్న శ్రీనివాసరెడ్డి.. జంబ లకిడి పంబ అంటూ మూవీ చేస్తున్నాడు. జె.బి. మురళికృష్ణ రచన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ కు ఓ వైపున హీరో శ్రీనివాస రెడ్డి కూర్చుని.. అద్దం పట్టుకుని తన పెదాలకు లిప్ స్టిక్ రాసుకుని మురిసిపోతూ ఉంటాడు. అదే సోఫాకు మరోవైపున కూర్చున్న హీరోయిన్ సిద్ధి ఇద్నాని.. సిగరెట్ తాగుతూ పోజ్ ఇచ్చిన విధానం బాగుంది.

అంతే కాదు.. హీరో పాత్ర అమ్మాయిల మాదిరి చెప్పులు వేసుకోవడం..నిండుగా బట్టలు ధరించడం చేస్తే.. హీరోయిన్ మాత్రం షార్ట్ లెంగ్త్ డ్రెస్సులు వేసుకుని.. మగవారు ధరించే మాదిరి చెప్పులతో కనిపిస్తుంది. పోస్టర్ లోనే ఇన్నేసి అంశాలను జంబ లకిడి పంబ చేసి పారేసి.. మంచి ఇంపాక్ట్ నే చూపించారు. సినిమా మొత్తం ఇదే స్థాయిలో తీయగలిగితే మాత్రం.. కచ్చితంగా ఈ కామెడీ సినిమా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది.