Begin typing your search above and press return to search.

కళ తప్పిన స్టార్స్‌ ఇళ్లు

By:  Tupaki Desk   |   13 July 2020 7:00 PM IST
కళ తప్పిన స్టార్స్‌ ఇళ్లు
X
ముంబయిలోని బాలీవుడ్‌ ప్రముఖులు ఉండే ఏరియాల్లో నిత్యం జనాల రద్దీ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్స్‌ ఇళ్ల వద్ద పొద్దున నుండి రాత్రి వరకు సందర్శకులు వందలు వేలల్లో ఉంటూనే ఉంటారు. అమితాబచ్చన్‌ ప్రతి ఆదివారం తన అభిమానులకు బాల్కనీ వద్దకు వచ్చి కనిపిస్తూ వారికి అభివాదం చేస్తూ ఉంటాడు. ఆదివారం మాత్రమే కాకుండా ఇతర రోజుల్లో కూడా స్టార్స్‌ ఏమైనా కనిపిస్తారేమో అంటూ అభిమానులు పెద్ద ఎత్తున వారి ఇళ్ల ముందు కనిపిస్తూ ఎప్పుడు కూడా ఆ వీధులు కళ కళలాడుతూ ఉంటాయి.

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఆ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతి ఆదివారం అమితాబచ్చన్‌ ఇంటి వద్ద జనాలు వేల సంఖ్యలో గుమ్మిగూడుతారు. కాని ఈసారి అమితాబ్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడం వల్ల ఆయన నివాసం ఉండే ఇంటి పరిసర ప్రాంతాలను కంటోన్మెంట్‌ ఏరియాగా ప్రకటించడం జరిగింది. దాంతో అసలు ఆ ఇంటి పరిసర ప్రాంతాలకు కూడా అభిమానులను వెళ్లనివ్వలేదు. దాంతో స్టార్స్‌ ఇళ్లు కళ తప్పినట్లయ్యింది. అమితాబ్‌ రికవరీ అయ్యి మళ్లీ త్వరలోనే అభిమానులకు కనిపిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు.