Begin typing your search above and press return to search.

మహేష్ అల్లుడు సినిమాకు జక్కన్న తోడ్పాటు

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:59 AM GMT
మహేష్ అల్లుడు సినిమాకు జక్కన్న తోడ్పాటు
X
సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు.. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మేనల్లుడు అయిన గల్లా అశోక్‌ హీరోగా రూపొందిన మొదటి సినిమా 'హీరో'. నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్‌ చాలా రోజుల క్రితమే పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉంది. కాని కరోనా మరియు ఇతర కారణాల వల్ల సినిమా వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. సంక్రాంతి సినిమాలు వాయిదా పడటంతో అశోక్‌ 'హీరో' సినిమా ను హడావుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. సంక్రాంతి కానుకగా జనవరి 15వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా హడావుడిగా విడుదల చేస్తున్నా కూడా ప్రమోషన్ విషయంలో ఎక్కడ కూడా తగ్గడం లేదు అనిపిస్తుంది.

ఈ సినిమా ట్రైలర్ ను సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు లేదా తాత గారు కృష్ణ చేతుల మీదుగా విడుదల చేయించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈ ట్రైలర్‌ ను రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. రమేష్ బాబు మృతి కారణంగా కుటుంబ సభ్యులు 'హీరో' సినిమా ప్రమోషన్‌ లో భాగస్వామ్యం అయ్యే అవకాశం లేదు. దాంతో రాజమౌళితో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయించేలా ప్లాన్‌ చేశారు అనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనా టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్‌ లాంచ్ అంటే ఖచ్చితంగా సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కడం మాత్రమే కాకుండా బజ్ క్రియేట్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

రాజమౌళి చేతుల మీదుగా నేడు సాయంత్రం 4.05 లకు విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి బరిలో ఉన్న పలు చిత్రాల్లో హీరో కూడా ప్రేక్షకుల మరియు ఇండస్ట్రీ వర్గాల వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్ బాబు మేనల్లుడు అవ్వడం వల్ల గల్లా అశోక్‌ సినిమా కు ఖచ్చితంగా బజ్ ఉంటుంది. సినిమా ఏమాత్రం పాజిటివ్‌ టాక్ వచ్చిన కూడా మంచి వసూళ్లను నమోదు చేయడం ఖాయం. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ లు.. పాటలు మరియు ఇతర పబ్లిసిటీ స్టఫ్ అంతా చూస్తుంటే హీరో సినిమా తో గల్లా మంచి నటుడిగా నిలదొక్కుకోవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కు శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వం వహించగా మహేష్ బాబు సోదరి అయిన పద్మావతి గల్లా గారు నిర్మించారు. సినిమాలో గల్లా అశోక్‌ కౌబాయ్‌ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కృష్ణ సూపర్‌ హిట్‌ సాంగ్‌ రీమిక్స్ చేయడంతో కూడా మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. మరి ఈ బజ్ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి.