Begin typing your search above and press return to search.

అందమైన జై లవకుశ కిడ్స్

By:  Tupaki Desk   |   26 Sept 2017 4:01 PM IST
అందమైన జై లవకుశ కిడ్స్
X
జై లవకుశ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ నటనలో నందమూరి పేరును మరో స్థాయికి తీసుకెళ్లాడనే చెప్పాలి. ఇప్పటికే సిని ఇండస్ట్రీలో పెద్దలు తారక్ నటనకు ఫిదా అయిపోయారు. సినిమా కన్నా సినిమాలో ఎన్టీఆర్ పాత్రలగురించే ఎక్కువగా పొగుడుతున్నారు అంటే.. తారక్ ఏ స్థాయిలో నటనను కనబరచాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా జై పాత్ర ఇప్పుడు చాలా ఫెమస్ అయ్యిందనే చెప్పాలి.

ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమా స్టార్టింగ్ కథలో ఒక బాల నటుడు మూడు పాత్రల్లో కూడా చక్కగా నటించాడు. మెయిన్ గా జై పాత్రలో పిల్లవాడు అనుకున్నట్లే తారక్ హావభావాలు కనబరిచాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆ బాలుడు ఎన్టీఆర్ కుటుంబానికి చెందినవాడని కొన్ని కామెంట్స్ వినిపించాయి. అసలు విషయం ఏమిటంటే ఆ పిల్లవాడు తారక్ లా ఒక్కడు కాదు. వారు ట్విన్స్.

అందులో ఒక బాలుడు జై పాత్రను లవ పాత్రను చేశాడు. అయితే వారు నందమూరి ఫ్యామిలీ వారు కాదని సమాచారం. దర్శకుడు ఆడిషన్ నిర్వహించి వందలమంది ట్విన్స్ ను పరీక్షించి ఫైనల్ గా వీరిద్దరిని ఎంచుకున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. మొత్తానికి జై లవకుశ ల చిల్డ్ ఎపిసోడ్ సీన్స్ చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అందమైన లోకం అనే పాటలో ఆ మూడు పాత్రలు కనిపించిన తీరుకు మంచి ప్రశంసలు అందాయి.