Begin typing your search above and press return to search.

లవకుశలకు అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   21 July 2018 11:11 AM IST
లవకుశలకు అరుదైన గౌరవం
X
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో చాలా స్పెషల్ గా నిలవడంతో పాటు మంచి విజయాన్ని అందుకున్న జై లవకుశ ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతి సారి మంచి రేటింగ్స్ తెచ్చుకుంటూ ఉంటుంది. మొదటి సారి ట్రిపుల్ రోల్ చేసిన మూవీ కాబట్టి అభిమానులు కూడా ముగ్గురు ఎన్టీఆర్ లను చూసుకుని మురిసిపోయారు. అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో నిర్మించిన జై లవకుశకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. నార్త్ కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో రెండు రోజుల ప్రదర్శనకు దీన్ని ఎంపిక చేసారు. ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో జై లవకుశకు ఈ గౌరవం దక్కింది. ఈ చిత్రోత్సవంలో పాల్గొంటున్న ఏకైక తెలుగు సినిమా జైలవకుశ మాత్రమే కావడం ఫ్యాన్స్ ని ఇంకా ఎగ్జైట్ చేస్తోంది. ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కు మనవాళ్లే కాదు ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ కాబోతున్నారని అభిమానులు సంబర పడుతున్నారు.

జైలవకుశతో ఈ ఛాన్స్ మరో ఐదు సినిమాలకు మాత్రమే దక్కింది. సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై-అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్-శ్రీదేవి మామ్-విజయ్ మెర్సల్(తెలుగు అదిరింది)తో పాటు ఎజ్రాలను మాత్రమే ఎంపిక చేసారు. వీటిని ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. జైలవకుశనే ఎంచుకోవడానికి కారణాలు చూస్తే ఒకే హీరో మూడు పాత్రలను చేస్తూ క్లిష్టంగా అనిపించే వేరియేషన్స్ ని చూపిస్తూ మెప్పించడం అందులో ముఖ్యంగా కనిపిస్తోంది. విశేషం ఏంటంటే విజయ్ మెర్సల్ కూడా ట్రిపుల్ రోల్ మూవీనే. కాకపోతే జైలవకుశ తరహాలో మూడు పాత్రలు ఒకేసారి కలిసే సీన్లు ఉండవు. ఆ విషయంలో తారక్ సినిమానే ఒక మెట్టు పైనే నిలించింది. రాశిఖన్నా-నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. షబ్ టైటిల్స్ తో జైలవకుశ ప్రదర్శన ఉంటుంది.